Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuc300fb98-9426-4f08-9f93-928b9efded8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babuc300fb98-9426-4f08-9f93-928b9efded8c-415x250-IndiaHerald.jpgఇక సినిమా కథ విషయానికొస్తే... హీరో చిన్నతనంలోనే తల్లికి దూరమవుతాడు. పెద్దయ్యాక తల్లి ముఖ్యమంత్రి అవుతుంది. తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. అయితే అతని నెగిటివ్ షేడ్స్‌తో పాటు చివరికి తల్లికొడుకులు ఎలా కలిశారన్నదే కథాంశం. క్రిటిక్స్ కథ, స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని విమర్శలు చేసినప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేసేశారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ రాబట్టినప్పటికీ, డిజిటల్, శాటిలైట్ రైట్స్‌తో సినిమా లాభాల్లోకి వచ్చింది. మొత్తానికి 'గుంటూరు కారం' మహేష్ కెరీర్‌లో చmahesh babu{#}Prakash Raj;choudary actor;mahesh babu;thaman s;trivikram srinivas;Makar Sakranti;Guntur;Father;Queen;Mass;Khaleja;Chitram;Telangana Chief Minister;India;Hero;Cinemaహెరాల్డ్ టాలీవుడ్ సూప‌ర్‌హిట్లు 2024 : మహేష్ మాస్ యాక్షన్‌తో దుమ్మురేపిన గుంటూరు కారం..హెరాల్డ్ టాలీవుడ్ సూప‌ర్‌హిట్లు 2024 : మహేష్ మాస్ యాక్షన్‌తో దుమ్మురేపిన గుంటూరు కారం..mahesh babu{#}Prakash Raj;choudary actor;mahesh babu;thaman s;trivikram srinivas;Makar Sakranti;Guntur;Father;Queen;Mass;Khaleja;Chitram;Telangana Chief Minister;India;Hero;CinemaTue, 17 Dec 2024 07:20:00 GMT* ఊర మాస్ అవతారంలో మహేష్ బాబు స్పెషల్ ట్రీట్

* త్రివిక్రమ్‌ మార్క్‌తో గుంటూరు కారం ఘాటెక్కింది

* సంక్రాంతి కానుకగా వచ్చి బాక్సాఫీస్ ని బద్దలు కొట్టింది  

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'గుంటూరు కారం' సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ యాక్షన్ డ్రామా మూవీ, మహేష్ కెరీర్‌లో 28వ సినిమాగా విడుదలై ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ట్రీట్‌నిచ్చింది. త్రివిక్రమ్ టచ్, తమన్ మ్యూజిక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌తో థియేటర్లు దద్దరిల్లాయి. ఖలేజా తర్వాత పదేళ్లకు మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం అంచనాలను ఈజీగా చేరుకోగలిగింది. ఇందులో గుంటూరు యాసలో మహేష్ బాబు చెప్పిన డైలాగులు బాగా పేలాయి. ఇక డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఎనర్జిటిక్, గ్రేస్ ఫుల్ డాన్స్ మూవ్స్‌తో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ పాటలో ఆమె హుక్ స్టెప్ తెగ వైరల్ అయిపోయింది చాలా మంది ఆ స్టెప్స్ ను రీ క్రియేట్ చేసి రీల్స్ చేశారు కూడా.

ఇప్పటికీ ఈ పాట చాలా చోట్ల మారుమోగిపోతోంది అంటే ఈ మూవీ క్రేజ్ దాదాపు సంవత్సరమైనా ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు ఈ మూవీలో స్మోకింగ్ చేస్తూ, ఒక ఊర మాస్ అవతారంలో కనిపించాడు. కేవలం మహేష్ యాక్షన్ సీన్లే గూజ్ బంప్స్ తెప్పించాయంటే అతిశయోక్తి కాదు. మహేష్ ను ఇలా చూపించినందుకు గాను త్రివిక్రమ్ కి ఫ్యాన్స్ స్పెషల్ థాంక్స్ కూడా చెప్పుకున్నారు.

ఇక సినిమా కథ విషయానికొస్తే... హీరో చిన్నతనంలోనే తల్లికి దూరమవుతాడు. పెద్దయ్యాక తల్లి ముఖ్యమంత్రి అవుతుంది. తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించాడు. అయితే అతని నెగిటివ్ షేడ్స్‌తో పాటు చివరికి తల్లికొడుకులు ఎలా కలిశారన్నదే కథాంశం. క్రిటిక్స్ కథ, స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని విమర్శలు చేసినప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేసేశారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ రాబట్టినప్పటికీ, డిజిటల్, శాటిలైట్ రైట్స్‌తో సినిమా లాభాల్లోకి వచ్చింది. మొత్తానికి 'గుంటూరు కారం' మహేష్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచిపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దేవినేని - జ‌క్కంపూడికి మంచి ఛాన్స్‌.. ఫ్రూవ్ చేసుకుంటే మంత్రులే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>