MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-nirmala67ac8a74-4655-48a7-b475-7ed273439071-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-nirmala67ac8a74-4655-48a7-b475-7ed273439071-415x250-IndiaHerald.jpgమంచు మోహన్ బాబు ఇంట్లో గత కొన్ని రోజుల నుంచి గొడవలు, విభేదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చుకోవడం గొడవలు పెట్టుకోవడం, వాయిస్ లో రిలీజ్ చేయడం మనందరం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా మంచు మోహన్ బాబు, విష్ణు తన అనుచరులతో కలిసి తనపై తన భార్యపై చేయి చేసుకున్నారని మనోజ్ కంప్లైంట్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. manchu nirmala{#}Nijam;Traffic police;manchu manoj kumar;Police Station;vishnu;editor mohan;mohan babu;Yevaru;police;Letterమంచు మనోజ్ తల్లి సంచలన లేఖ....గొడవలు పెట్టింది అతనే ?మంచు మనోజ్ తల్లి సంచలన లేఖ....గొడవలు పెట్టింది అతనే ?manchu nirmala{#}Nijam;Traffic police;manchu manoj kumar;Police Station;vishnu;editor mohan;mohan babu;Yevaru;police;LetterTue, 17 Dec 2024 13:09:00 GMTమంచు మోహన్ బాబు ఇంట్లో గత కొన్ని రోజుల నుంచి గొడవలు, విభేదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చుకోవడం గొడవలు పెట్టుకోవడం, వాయిస్ లో రిలీజ్ చేయడం మనందరం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా మంచు మోహన్ బాబు, విష్ణు తన అనుచరులతో కలిసి తనపై తన భార్యపై చేయి చేసుకున్నారని మనోజ్ కంప్లైంట్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.


మోహన్ బాబు కూడా అదే రీతిలో మంచు మనోజ్ తనపై చేయి చేసుకున్నాడని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో రోజురోజుకు ఏదో ఒక విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. ఈ విషయం పైన కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు స్పందిస్తూ ఈరోజు కాకపోతే రేపు మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే గొడవలు అన్నీ తొలగిపోతాయి. మా కుటుంబంలోని గొడవలలో ఎవరు చోటు చేసుకోవద్దంటూ చెప్పాడు. కాగా, మంచు వారి కుటుంబంలో మరో ట్విస్ట్ తాజాగా వెలుగులోకి వచ్చింది.

వీరి గొడవలు రాను రాను తారస్థాయికి చేరుతున్నాయి. ఈ విషయం పైన పోలీసులు జోక్యం చేసుకొని విచారణకు మనోజ్, విష్ణును కాస్త గట్టిగానే మందలించారు. అంతేకాకుండా మనోజ్ ను బైండోవర్ చేయడంతో ఈ గొడవ కాస్త సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు మనోజ్ పోలీస్ స్టేషన్ లో మళ్లీ తన ఇంటికి వచ్చి రెండు రోజుల క్రితం విష్ణు జనరేటర్ లో చక్కెర పోసి వెళ్లాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఈ విషయం పైన తాజాగా మంచు మనోజ్ తల్లి నిర్మల రియాక్ట్ అయ్యారు. గత రెండు రోజుల క్రితం జనరేటర్ లో విష్ణు చక్కర పోసి వెళ్లాడని మనోజ్ చేసిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని నిర్మల కొట్టి పారేశారు.


ఈ విషయాన్ని స్వయంగా నిర్మల పహాడి షరీఫ్ పోలీసులకు లేఖ రూపంలో తెలియజేశారు. విష్ణు ఎవరితోనో గొడవలు పెట్టుకోలేదని ఆమె స్పష్టం చేసింది. తన పుట్టినరోజు సందర్భంగా విష్ణు స్వయంగా కేక్ తీసుకుని ఇంటికి వచ్చి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకొని విష్ణు వెళ్ళిపోయాడని నిర్మల వెల్లడించారు. అంతకుమించి అక్కడ ఏమి జరగలేదని చెప్పారు. అంతకుమించి విష్ణు జనరేటర్ లో చెక్కర పోయలేదు. ఎలాంటి గొడవ చేయలేదు అంటూ పోలీసులకు మోహన్ బాబు సతీమణి నిర్మల లేఖ రూపంలో తెలియజేశారు. మనోజ్ కంప్లయింట్ చేసిన దానిలో నిజం లేదని వివరణించారు నిర్మల.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పాపం..శుభమాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే.. కీర్తి సురేష్ కి ఇలా జరిగింది ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>