Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/jasprit-bumrah-71b768b6-0e61-4ac1-a9b5-5006e2202fd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/jasprit-bumrah-71b768b6-0e61-4ac1-a9b5-5006e2202fd3-415x250-IndiaHerald.jpg అవును, ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా సంచలన రికార్డ్ నమోదు చేసాడు. 2 మ్యాచులు ముగిసే సరికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-1తో సమమైనవేళ గబ్బా టెస్టు ప్రారంభమైంది. ఈ తరుణంలో ఎలా ఆడాలి? ప్రత్యర్థిని ఇలా మట్టి కురిపించాలి? అని టీమిండియా తీవ్రమైన కసరత్తులు చేస్తూనే తడబడుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత బౌలర్లలో బుమ్రా మినహా మరెవ్వరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే విషయం అందరికీ తెలిసినదే. బుమ్రా మొదటి నుండీ ఆస్ట్రేలియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ.. వికెట్లు పడగొడుతున్నప్పటికీ మిగతా బౌలర్లు మాత్రం పట్టు కోJasprit Bumrah {#}Australiaవారెవ్వా.. ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా సంచలన రికార్డ్?వారెవ్వా.. ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా సంచలన రికార్డ్?Jasprit Bumrah {#}AustraliaMon, 16 Dec 2024 13:45:00 GMT
అవును, ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా సంచలన రికార్డ్ నమోదు చేసాడు. 2 మ్యాచులు ముగిసే సరికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-1తో సమమైనవేళ గబ్బా టెస్టు ప్రారంభమైంది. ఈ తరుణంలో ఎలా ఆడాలి? ప్రత్యర్థిని ఇలా మట్టి కురిపించాలి? అని టీమిండియా తీవ్రమైన కసరత్తులు చేస్తూనే తడబడుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత బౌలర్లలో బుమ్రా మినహా మరెవ్వరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే విషయం అందరికీ తెలిసినదే. బుమ్రా మొదటి నుండీ ఆస్ట్రేలియా బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ.. వికెట్లు పడగొడుతున్నప్పటికీ మిగతా బౌలర్లు మాత్రం పట్టు కోల్పోతున్నారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు బుమ్రా విషయంలో ఆచితూచి ఆడుతూ.. మిగతా భారత బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్నారు. బుమ్రా ఒక్కడిపైనే భారం అనేది అతనికి కూడా ఓ తరుణంలో చాలా కష్టంగా మారింది.

ఈ క్రమంలో కూడా గబ్బాలో టాస్ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఆస్ట్రేలియాను బుమ్రా వణికించాడు. స్వింగ్, స్వీమ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో వరుస ఓవర్లలో ఉస్మాన్ ఖవాజా, మెక్ స్వీనిని ఔట్ చేసి ప్రత్యర్థులకు కళ్లెం వేసాడు. ఈ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌‌లోకి అరంగేట్రం చేసిన మెక్ స్వీని.. ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగు సార్లు బుమ్రా బౌలింగ్‌లోనే ఔట్ కావడం కొసమెరుపు. అయితే ఈ దశలో బుమ్రాకు మరో బౌలర్ నుంచి సహకారం అందుంటే బావుండేది. కానీ అలా జరగలేదు. సిరాజ్, ఆకాశ్ దీప్‌ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఈజీగా పరుగులు రాబట్టారు. దీంతో పట్టుబిగించాల్సిన స్థితిలో భారత బౌలర్లు తడబడ్డారు.

ఆ తర్వాత కొత్త బంతితో బుమ్రా మరోసారి తన మార్క్ సత్తా చాటాడు. 12 బంతుల వ్యవధిలోనే స్మిత్, మార్ష్‌లను ఔట్ చేసి పెవిలియన్ పంపించాడు. ఈ క్రమంలోనే ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా మొత్తంగా ఈ మ్యాచ్‌లో 28 ఓవర్లు బౌలింగ్ వేసిన బుమ్రా 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో 76 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సమయంలో సిరాజ్, ఆకాశ్ దీప్, నితీశ్ రెడ్డి, జడేజాలు మాత్రం 89 బౌలింగ్ చేసినా.. 4 వికెట్లు మాత్రమే తీయగలిగి ఏకంగా 352 పరుగులు సమర్పించుకున్నారు. ఈ గణాంకాలు చూస్తేనే టీమిండియా బుమ్రాపై ఎంత ఆధారపడుతుందో అని అర్ధం అవుతోంది. ఈ సిరీస్ అనే కాదు.. ఏ మ్యాచ్‌లో గెలవాలన్నా ఇలా ఒక్కరిపై ఆధారపడటం ఏమాత్రం సమంజసం కాదు అని విశ్లేషకులు అంటున్నారు. బుమ్రా రికార్డులు కొట్టినప్పటికీ మ్యాచెస్ గెలిస్తేనే కదా వాటికి అర్ధం ఉంటుందని అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్ 'దేవర' పాటకి.. రాజమౌళి అదిరిపోయే డాన్స్.. వైరల్ వీడియో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>