DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/balayya77458461-7fc6-433f-88f5-07044e882aaa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/balayya77458461-7fc6-433f-88f5-07044e882aaa-415x250-IndiaHerald.jpgతెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అవి గతంలో ఏ సీఎం తీసుకోని విధంగా ఉంటున్నాయని అంటున్నారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ ని కూల్చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇపుడు తన బుల్డోజర్ ని ఏకంగా ప్రముఖ నటుడు టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి మీదకు పంపించనుందా అన్నది చర్చగా ఉంది. రేవంత్ రెడ్డి టీడీపీలోనే రాజకీయంగా ఎదిగారు. అంతే కాదు చంద్రబాబుకు శిష్యుడిగానూ ఉన్నారు. పైగా నందమూరి బాలక్రిష్ణతో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. మరి అలాంటిది బాలయ్య ఇంటిbalayya{#}Huzur Nagar;Janareddy;Nijam;TDP;Revanth Reddy;Government;Congress;Minister;CM;MLA;Yevaru;Balakrishna;Reddy;News153. ఓర్నీ బాలయ్య ఇంటి మీదకి బుల్డోజర్ వెళ్లనుందా?153. ఓర్నీ బాలయ్య ఇంటి మీదకి బుల్డోజర్ వెళ్లనుందా?balayya{#}Huzur Nagar;Janareddy;Nijam;TDP;Revanth Reddy;Government;Congress;Minister;CM;MLA;Yevaru;Balakrishna;Reddy;NewsMon, 16 Dec 2024 09:25:57 GMTతెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది.  అవి గతంలో ఏ సీఎం తీసుకోని విధంగా ఉంటున్నాయని అంటున్నారు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్ ని కూల్చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇపుడు తన బుల్డోజర్ ని ఏకంగా ప్రముఖ నటుడు టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి మీదకు పంపించనుందా అన్నది చర్చగా ఉంది.



రేవంత్ రెడ్డి టీడీపీలోనే రాజకీయంగా ఎదిగారు. అంతే కాదు చంద్రబాబుకు శిష్యుడిగానూ ఉన్నారు.  పైగా నందమూరి బాలక్రిష్ణతో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. మరి అలాంటిది బాలయ్య ఇంటినే బుల్డోజర్ టార్గెట్ చేస్తుంది అంటే ఎవరూ నమ్మలేని వార్తే.  కానీ అదే నిజం అంటున్నారు.  ఇక బాలయ్యతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి ఇంటి మీదకు కూడా బుల్డోజర్ వస్తుందని అంటున్నారు.


ఫిల్మ్ నగర్ లో ఉన్న బాలక్రిష్ణ ఇంటిటికి ఏకంగా ఆరేడు అడుగుల వరకూ మార్కింగ్ చేసి పెట్టారు అని అంటున్నారు. ఇక ఇదే పని మీద బాలయ్య ఇంటి దాకా బుల్డోజర్లు కూడా తీసుకుని వస్తాయని కూడా వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటి దగ్గర కూడా మార్కింగ్ వేశారని అంటున్నారు.  ఈ ఇద్దరి ఇళ్ళనే ఎందుకు టార్గెట్ చేశారు అంటే కేబీఆర్ పార్కు మొత్తంలో ఉన్న ప్రాంతాన్ని ఆనుకుని ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు, అండర్ పాస్ లను పెద్ద ఎత్తున నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు


అందులో భాగంగా కొంత మేరకు ఈ ఇద్దరి భూములు కావాల్సి ఉందని అంటున్నారు. అందుకే భూసేకరణలో భాగంగానే మార్కింగులు చేశారని అంటున్నారు. అలా రానున్న రోజులలో ఈ ఇద్దరికి చెందిన కొంత భూమిని తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది.


జానారెడ్డి కాంగ్రెస్ మనిషి, బాలయ్య కావాల్సిన మనిషి. అయినా అభివృద్ధి పనుల నేపధ్యంలో భూములు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది అన్న వార్తలు వస్తున్నాయి.   అయితే తమ ప్రభుత్వానికి ఎవరు ఎంత సన్నిహితమైనా పట్టింపు లేదని పూర్తి పక్షపాత రహితంగా తాము డెసిషన్స్ తీసుకుంటున్నామని చెప్పడానికే ఈ తరహా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 10 డేస్ రిపోర్ట్ : ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఎంత రాబట్టిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>