MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-movies8d1cd770-a550-4c00-9158-53cebad3b177-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-movies8d1cd770-a550-4c00-9158-53cebad3b177-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , బాలకృష్ణ మొదటి వరుసలో ఉంటారు. వీరిద్దరూ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఎన్నో సార్లు వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. అందులో కొన్ని సార్లు చిరంజీవి గెలుపొందితే మరి కొన్ని సార్లు బాలకృష్ణ గెలుపొందాడు. ఇకపోతే మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోల మధ్య సంక్రాంతి పండక్కుఆ చాలా సార్లు బాక్స్ ఆఫీTollywood movies{#}Makar Sakranti;Box office;Hero;Balakrishna;Telugu;Chiranjeevi;Cinemaచిరు.. బాలయ్య మొట్టమొదటి సంక్రాంతి వార్ ఏ సినిమాలతో.. గెలిచిందెవరంటే..?చిరు.. బాలయ్య మొట్టమొదటి సంక్రాంతి వార్ ఏ సినిమాలతో.. గెలిచిందెవరంటే..?Tollywood movies{#}Makar Sakranti;Box office;Hero;Balakrishna;Telugu;Chiranjeevi;CinemaMon, 16 Dec 2024 11:05:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , బాలకృష్ణ మొదటి వరుసలో ఉంటారు. వీరిద్దరూ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇప్పటికీ కూడా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఎన్నో సార్లు వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. అందులో కొన్ని సార్లు చిరంజీవి గెలుపొందితే మరి కొన్ని సార్లు బాలకృష్ణ గెలుపొందాడు. ఇకపోతే మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోల మధ్య సంక్రాంతి పండక్కుఆ చాలా సార్లు బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది. మరి మొదటి సారి ఈ ఇద్దరు హీరోలకు ఏ సినిమాతో సంక్రాంతి పండక్కి బాక్స్ ఆఫీస్ వార్ జరిగిందో తెలుసా ..? ఆ సినిమా ఏది ..? అందులో ఏ హీరో పై చేయి సాధించాడు అనే వివరాలను తెలుసుకుందాం.

మొట్ట మొదటి సారి మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ మధ్య 1985 వ సంవత్సరం సంక్రాంతి పండక్కి పోటీ జరిగింది. ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన చట్టంతో పోరాటం సినిమా విడుదల అయితే , నందమూరి బాలకృష్ణ హీరో గా రూపొందిన ఆత్మబలం సినిమా విడుదల అయింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా భారీ అంచనాల నడుమ 1985 సంక్రాంతి బరిలో నిలిచాయి. ఈ రెండు సినిమాల్లో చిరంజీవి హీరోగా రూపొందిన చట్టంతో పోరాటం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా , బాలకృష్ణ హీరోగా రూపొందిన ఆత్మబలం సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదు. దానితో 1985 వ సంవత్సరం మొట్ట మొదటి సారి సంక్రాంతి పండక్కు వీరిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ జరగగా అందులో చిరంజీవి "చట్టంతో పోరాటం" అనే సినిమాతో బాలయ్య పై చేయి సాధించినట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నిఖిల్ కావ్య లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు.. మళ్ళీ కలుస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>