Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manju-warrierff9737d4-4606-4a70-b846-8148de5316ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manju-warrierff9737d4-4606-4a70-b846-8148de5316ff-415x250-IndiaHerald.jpg హీరోయిన్ మంజు వారియర్ గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ట్రాక్ రికార్డ్ గురించి తెలిస్తే, ఆమెకి చేతులు జోడించి మొక్కుతారు. అవును, ఆమె 17 ఏళ్ల వయస్సులోనే వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వడం.. 20 ఏళ్లకే పెళ్లి.. 21 ఏళ్లకే నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఆ తరువాత ఆమె దాదాపు 14 ఏళ్ల పాటు నటనకి దూరంగా ఉంది, పెళ్లయిన 16 ఏళ్లకి విడాకులు ఇచ్చేసింది. అవును, ఆమె తనకి ఇష్టమైన వ్యక్తి కోసం అంతకంటే ఇష్టమైన సినిమానే త్యాగం చేసింది. చివరికి కన్న కూతురు కూడా దూరమైతే ఆ మానసిక క్షోభ ఎలా ఉంటుందో తెలుసా?Manju Warrier{#}Variar;Kuchipudi;Husband;Rajani kanth;Cinema;Heroఈ హీరోయిన్ లో ఈ టాలెంట్ కూడా ఉందా.. వీడియో వైరల్?ఈ హీరోయిన్ లో ఈ టాలెంట్ కూడా ఉందా.. వీడియో వైరల్?Manju Warrier{#}Variar;Kuchipudi;Husband;Rajani kanth;Cinema;HeroMon, 16 Dec 2024 13:13:00 GMT
హీరోయిన్ మంజు వారియర్ గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ట్రాక్ రికార్డ్ గురించి తెలిస్తే, ఆమెకి చేతులు జోడించి మొక్కుతారు. అవును, ఆమె 17 ఏళ్ల వయస్సులోనే వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వడం.. 20 ఏళ్లకే పెళ్లి.. 21 ఏళ్లకే నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఆ తరువాత ఆమె దాదాపు 14 ఏళ్ల పాటు నటనకి దూరంగా ఉంది, పెళ్లయిన 16 ఏళ్లకి విడాకులు ఇచ్చేసింది. అవును, ఆమె తనకి ఇష్టమైన వ్యక్తి కోసం అంతకంటే ఇష్టమైన సినిమానే త్యాగం చేసింది. చివరికి కన్న కూతురు కూడా దూరమైతే ఆ మానసిక క్షోభ ఎలా ఉంటుందో తెలుసా? ఆ బాధను ఎవరూ తీర్చలేరు సరికదా అలాంటి ఛాలెంజింగ్ జీవితం ఆమె సొంతం.

ఈ అచ్చమైన మలయాళీ అందం సినిమాకి ఓ అలంకరణగా మారింది. ఆమె అద్భుతమైన కూచిపూడి డ్యాన్సర్ కూడా. సీరియల్‌తో మొదలైన ఆమె నటజీవితం.. సినిమాలవైపుకి మళ్లింది. 1995లో తొలిసారి వెండితెరపై కనిపించిన మంజు వారియర్ కేవలం ఐదేళ్లలోనే 20 సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా 1999లో ఆమె నటించిన 'కన్నేయితి పొట్టుం తొట్టు' అనే చిత్రానికి గాను మంజుకి ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. అలా 21 ఏళ్లకే నేషనల్ అవార్డు అందుకున్న నటిగా ఆమె పేరు దక్కించుకుంది. మంజు వారియర్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా 1998లో తన కో యాక్టర్, స్టార్ హీరో దిలీప్‌తో ఆమె వివాహం జరగడంతో అనూహ్యంగా సినిమాలకి దూరమైంది మంజు వారియర్.

ఆ తరువాత భర్తే దైవంగా, ఇల్లే సర్వంగా బతికేసింది మంజు వారియర్. కానీ విధి ఆడిన వింతనాటకంలో ఆమె బలి అయింది. భర్త తనని మోసం చేయడమే కాకుండా కూతురిని కూడా దూరం చేసాడు. కోర్టులో కూడా తన కూతురు తండ్రితోనే ఉంటానని తేల్చి చెప్పడంతో ఆమె ఒంటరి అయింది. ఆ తరువాత సరిగ్గా 15 ఏళ్ల తర్వాత ఆమె ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో తమిళంలో అసురన్, మలయాళంలో లూసిఫర్ సినిమాలు చేసిన ఆమె ఇక తిరిగి వెనక్కి చూసుకోలేదు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన 'వేట్టయాన్' చిత్రంలో నటించింది మంజు. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన 'మానాసిలాయో' పాటలో మంజు డ్యాన్స్, గ్రేస్, అందం అన్నీ ఆడియన్స్‌కి విపరీతంగా నచ్చేశాయి కూడా. అవన్నీ ఒకెత్తు అయితే, ఆమె తాజాగా "విడుదల 2" సినిమాలోని 'పావురమా పావురమా' అనే పాటతో ఆమెలోని మరోకోణం ప్రపంచానికి పరిచయం చేసింది. అవును, ఆమె తన ఫ్యాన్స్‌కి ఆమె నిజంగా 'వారియర్' అని చెప్పుకోవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎన్టీఆర్ 'దేవర' పాటకి.. రాజమౌళి అదిరిపోయే డాన్స్.. వైరల్ వీడియో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>