MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedస్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యారు. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి.. ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. movie{#}Sushant Singh;suman;Drugs;Sanjay Dutt;118;RTC;Mumbai;bollywood;Revathi;sandhya;Evening;Chiranjeevi;police;Arjun;Hero;Arrest;Allu Arjunసుమన్ నుండి అల్లు అర్జున్ వరకు..జైలుకు వెళ్లి వచ్చిన తారలు వీరేసుమన్ నుండి అల్లు అర్జున్ వరకు..జైలుకు వెళ్లి వచ్చిన తారలు వీరేmovie{#}Sushant Singh;suman;Drugs;Sanjay Dutt;118;RTC;Mumbai;bollywood;Revathi;sandhya;Evening;Chiranjeevi;police;Arjun;Hero;Arrest;Allu ArjunSat, 14 Dec 2024 10:07:00 GMTస్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన  తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యారు. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి.. ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే.  
అయితే ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇలా చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్న మొదటి సెలబ్రిటీ కాదు. గతంలో కూడా కొందరు సినీ నటులు జైల్ కి వెళ్లి వచ్చారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.. మద్రాసులో పుట్టిపెరిగిన సీనియర్ నటుడు సుమన్ తల్వార్ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించి మెప్పించాడు. ఒకప్పట్లో బహుభాషా హీరోగా ఒక వెలుగు వెలిగాడు. చిరంజీవి లాంటి స్టార్‌ హీరోలతో కూడా సుమ‌న్‌ పోటీ పడేవాడు. అయితే పోర్న్ గ్రఫీ కేసులో ఆయన కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనను అక్రమంగా ఇరికించినట్టు తేలడంతో నిర్దోషిగా బయటకు వచ్చారు. అప్పటికే హీరోగా ఆయనకు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. తెలుగు, మిగతా దక్షిణాది పరిశ్రమల్లో కూడా ఈయన ఒక్కరే జైలు జీవితం గడపాల్సిన రావడం దురదృష్టకరం అని చెప్పవచ్చు.
అలాగే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో  జైలు శిక్ష అనుభవించాడు. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ అని పిలువబడే సంజయ్ దత్ 1993 ముంబై బాంబు పేలుళ్లలో దోషిగా జైలులో ఉన్నాడు. ఇకపోతే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్స్ కేసుకు సంబంధించి రియా అరెస్ట్ ఇండస్ట్రీ డ్రగ్స్ సమస్యను తెరపైకి తెచ్చింది. బెయిల్‌పై విడుదల కావడానికి ముందు ఆమె ఒక నెల జైలు జీవితం గడిపింది. నటుడు షైనీ అహుజా తన ఇంటి పనిమనిషిపై అత్యాచారం చేసినందుకు ఏడేళ్ల జైలు శిక్ష విధించబడింది.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>