LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/malnutrition--winter-good--pregnant-women-health-eate1953a7d-2707-43d3-8a0b-907732c8ef4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/malnutrition--winter-good--pregnant-women-health-eate1953a7d-2707-43d3-8a0b-907732c8ef4f-415x250-IndiaHerald.jpgగర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తింటూ ఉండాలి. సాధారణంగా చలికాలంలో పోషకాహార లోపం ఏర్పడే అవకాశం కూడా పెరుగుతుంది. మిగతా సీజన్లో కంటే ఆహారం తక్కువగా తీసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గటం వంటివి ఇందుకు కారణం అవుతాయి. ముఖ్యంగా గర్భిణీలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే.. గర్భMalnutrition ; winter; good ; pregnant; women; health; eat{#}Vitamin C;Iron;Magnesium;Pomegranate;Protiens;protein;Vitamin;Shakti;Fishచలికాలంలో పోషకాహార లోపం.. గర్భిణీలకు మేలు చేసే ఫుడ్స్ ఇవే..!చలికాలంలో పోషకాహార లోపం.. గర్భిణీలకు మేలు చేసే ఫుడ్స్ ఇవే..!Malnutrition ; winter; good ; pregnant; women; health; eat{#}Vitamin C;Iron;Magnesium;Pomegranate;Protiens;protein;Vitamin;Shakti;FishSat, 14 Dec 2024 16:03:38 GMTగర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తింటూ ఉండాలి. సాధారణంగా చలికాలంలో పోషకాహార లోపం ఏర్పడే అవకాశం కూడా పెరుగుతుంది. మిగతా సీజన్లో కంటే ఆహారం తక్కువగా తీసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గటం వంటివి ఇందుకు కారణం అవుతాయి. ముఖ్యంగా గర్భిణీలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే.. గర్భిణీలు పాలకూరను తప్పక తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్లు, ముఖ్యంగా ఐరన్ పుష్కలంగా ఉంటాయి. రక్త కణాల నిర్మాణంలో, ఒక నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బాదం, వాల్ నట్స్, ఖర్జూరాలు సహా పలు రకాల డ్రై ఫ్రూట్స్ లో విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గర్భిణీలు వీటిని తీసుకోవటం మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే సాల్మన్, సార్టిన్, ట్యూనా వంటి చేపలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కడుపులో బిడ్డ ఎదుగులకు, ముఖ్యంగా మెదడు ఎదుగుదలకు ఇవి సహాయపడతాయి. విటమిన్ ఎ చలికాలంలో వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది పుష్కలంగా ఉండే చిలగడ దుంపలను గర్భిణీలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అట్లనే విటమిన్ సి కలిగి ఉండే ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ , రేగి పండ్లు వంటివి తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గర్భిణీలు పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగాస్టారే అల్లు అర్జున్ ను జైలుకెళ్లకుండా కాపాడారా.. చక్రం అలా తిప్పారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>