MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-arrest-pushpa-2-sandya-theater-revathib05cd77c-e0db-4d69-8e68-92c2ee57f159-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-arrest-pushpa-2-sandya-theater-revathib05cd77c-e0db-4d69-8e68-92c2ee57f159-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఎన్నో ఊహగాణాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యారు.. అసలు సమస్య ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.పుష్ప టు సినిమా డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబర్ 5 కంటే ముందు రోజు డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు వేసిన సంగతి మనకు తెలిసిందే.. అయితే ఈ పుష్ప-2 ప్రీమియర్స్ చూడడానికి అల్లు అర్జున్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సంధ్య థియేటర్ కి భార్య స్నేహారెడ్డి అలాALLU ARJUN ARREST; PUSHPA 2; SANDYA THEATER; REVATHI{#}Revathi;sandhya;police;Traffic police;Telangana;Arrest;Police Station;Wife;Evening;Allu Arjun;Cinema;News;December;Heroineబన్నీ ఫ్యాన్స్ కి షాక్.. అల్లు అర్జున్ అరెస్ట్.?బన్నీ ఫ్యాన్స్ కి షాక్.. అల్లు అర్జున్ అరెస్ట్.?ALLU ARJUN ARREST; PUSHPA 2; SANDYA THEATER; REVATHI{#}Revathi;sandhya;police;Traffic police;Telangana;Arrest;Police Station;Wife;Evening;Allu Arjun;Cinema;News;December;HeroineFri, 13 Dec 2024 12:47:00 GMT గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఎన్నో ఊహగాణాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యారు.. అసలు సమస్య ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.పుష్ప టు సినిమా డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబర్ 5 కంటే ముందు రోజు డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు వేసిన సంగతి మనకు తెలిసిందే.. అయితే ఈ పుష్ప-2  ప్రీమియర్స్ చూడడానికి అల్లు అర్జున్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సంధ్య థియేటర్ కి భార్య స్నేహారెడ్డి అలాగే హీరోయిన్ రష్మిక మందన్నాతో  కలిసి వచ్చారు. అయితే అలా వచ్చిన సమయంలో ఎంతోమంది అభిమానులు అల్లు అర్జున్  ని చూడడానికి ఎగబడ్డారు.

ఆ సమయంలో రేవతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి పుష్ప టు ప్రీమియర్ షో చూడడానికి సంధ్య థియేటర్ కి వచ్చింది.ఇక అక్కడ చాలామంది అభిమానులు ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట జరిగి ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఇక రేవతి కొడుకు కూడా తీవ్ర గాయాలపాలవ్వడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అయితే ఈ ఘటనపై  అదే రోజు సంధ్య థియేటర్ ఓనర్ పై, అల్లు అర్జున్ పై పోలీస్ కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిదే.అయితే తాజాగా ఈ కేసులో అల్లు అర్జున్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు.

దీంతో ఈ విషయం కాస్తా మీడియాలో వైరల్ అయింది.అయితే రీసెంట్ గా సంధ్య థియేటర్ ఓనర్ రేవతి మృతి తో మాకు ఎలాంటి సంబంధం లేదని ప్రీమియర్ షోస్ వేసుకోవచ్చు అని తెలంగాణ గవర్నమెంటే అనుమతి ఇచ్చింది.అలాగే మా తప్పేమీ లేదు అంతా డిస్ట్రిబ్యూటర్లదే తప్పు అన్నట్లుగా డిస్ట్రిబ్యూటర్ల మీదికి తోసేశారు. అయితే తాజాగా ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అభిమానులకు పెద్ద షాక్ తగిలినట్టు అయింది. మరి చూడాలి ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూర్య కంగువ‌లో నటించిన ఈ నటి ఎవరో తెలుసా .. ఆమె అక్కడ చాలా ఫేమస్ బాసు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>