MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-allu-shot-the-climax-scene-in-just-days535e262c-4206-470a-a3fe-513b5d9484a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-allu-shot-the-climax-scene-in-just-days535e262c-4206-470a-a3fe-513b5d9484a2-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. బన్నీని ప్రస్తుతం ఎంక్వైరీకి మాత్రమే పిలిచారని అరెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన టీం చెబుతోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుందని సమాచారం అందుతోంది. బన్నీ అరెస్ట్ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేసింది. allu arjun{#}Tollywood;cinema theater;media;118;Arjun;Nijam;Revathi;Allu Arjun;Police Station;Cinema;News;police;Arrestబన్నీ అరెస్ట్ వార్తల్లో అసలు వాస్తవాలివే.. ఆయన టీం క్లారిటీ ఇచ్చేసిందిగా!బన్నీ అరెస్ట్ వార్తల్లో అసలు వాస్తవాలివే.. ఆయన టీం క్లారిటీ ఇచ్చేసిందిగా!allu arjun{#}Tollywood;cinema theater;media;118;Arjun;Nijam;Revathi;Allu Arjun;Police Station;Cinema;News;police;ArrestFri, 13 Dec 2024 13:36:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. బన్నీని ప్రస్తుతం ఎంక్వైరీకి మాత్రమే పిలిచారని అరెస్ట్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన టీం చెబుతోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుందని సమాచారం అందుతోంది. బన్నీ అరెస్ట్ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్ చేసింది.
 
ప్రస్తుతం బన్నీ పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. పోలీసులు అల్లు అర్జున్ పై బీ.ఎన్.ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బన్నీ థియేటర్ కు వచ్చిన సమయంలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. బన్నీ అరెస్ట్ వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి.
 
పుష్ప ది రూల్ మూవీ బెనిఫిట్ షోలు పరోక్షంగా రేవతి మృతికి కారణమయ్యాయి. థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్ లో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. పోలీసులకు సైతం బన్నీథియేటర్ కు వస్తారనే సమాచారం లేదని భోగట్టా. పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకోగా బన్నీకి పదేళ్ల జైలు శిక్ష పడుతుందని ప్రచారం జరుగుతోంది.
 
అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో బన్నీ టైమ్ అస్సలు బాలేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. బన్నీ ఈ వివాదం నుంచి బయటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సెలబ్రిటీలు బయటకు వెళ్లిన సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అరెస్ట్ బన్నీ మెంటల్ హెల్త్ పై కొంతమేర ప్రభావం చూపే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూర్య కంగువ‌లో నటించిన ఈ నటి ఎవరో తెలుసా .. ఆమె అక్కడ చాలా ఫేమస్ బాసు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>