EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan972d244d-1ac1-4432-bb8a-890b93de0a33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan972d244d-1ac1-4432-bb8a-890b93de0a33-415x250-IndiaHerald.jpgవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యూహం మార్చిన విషయం తెలిసిందే. ఆయన న్యాయ పోరాటానికే మొగ్గు చూపుతున్నారు. తన పరువు తీస్తున్నారంటూ..ఓ రెండు పత్రికలపై ఢిల్లీ కోర్టులో కేసులు వేయడం.. పరువు నష్టం కింద రూ.100 కోట్లు డిమాండ్ చేయడం తెలిసిందే. అయితే..ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబుకు ఇబ్బందులు ఏర్పడుతున్నా యి. ఎందుకంటే.. పారిశ్రామిక వేత్త అదానీ వ్యవహారంలో జగన్ లంచాలు తీసుకున్నారనేది ఆ పత్రికలు చేసిన ఆరోపణ. ఇదే జగన్ హైకోర్టుకు వెళ్లే వరకు తెచ్చింది. దీనిలో ఆయన పత్రికలనే టార్గెట్ చేసినా.. పరిణామాలు మాత్రం jagan{#}Delhi;Jagan;High court;Deputy Chief Minister;CM;Yevaruరూటు మార్చిన జగన్..? చంద్రబాబుని ఇలా ఇరికించేశారు ఏంటి?రూటు మార్చిన జగన్..? చంద్రబాబుని ఇలా ఇరికించేశారు ఏంటి?jagan{#}Delhi;Jagan;High court;Deputy Chief Minister;CM;YevaruFri, 13 Dec 2024 13:35:00 GMTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యూహం మార్చిన విషయం తెలిసిందే.  ఆయన న్యాయ పోరాటానికే మొగ్గు చూపుతున్నారు.  తన పరువు తీస్తున్నారంటూ..ఓ రెండు పత్రికలపై ఢిల్లీ కోర్టులో కేసులు వేయడం.. పరువు నష్టం కింద రూ.100 కోట్లు డిమాండ్ చేయడం తెలిసిందే.  



అయితే..ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబుకు ఇబ్బందులు ఏర్పడుతున్నా యి. ఎందుకంటే.. పారిశ్రామిక వేత్త అదానీ వ్యవహారంలో జగన్ లంచాలు తీసుకున్నారనేది ఆ పత్రికలు చేసిన ఆరోపణ. ఇదే జగన్ హైకోర్టుకు వెళ్లే వరకు తెచ్చింది. దీనిలో ఆయన పత్రికలనే టార్గెట్ చేసినా.. పరిణామాలు మాత్రం సర్కారు వరకు వస్తున్నాయి.


అదానీకి, జగన్‌కు మధ్య లంచాల వ్యవహారం సాగి.. ప్రజలపై భారం పడుతుంటే.. సర్కారు ఏం చేస్తోందన్న విమర్శలు సోషల్ మీడియాలో జోరుగానే వినిపిస్తున్నాయి.  సోషల్ మీడియాను పక్కన పెట్టినా.. హైకోర్టు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదానీ వ్యవహారంలో లంచాలు ఉన్నట్టు తేలినప్పుడు సదరు ఒప్పందాలను సర్కారు రద్దు చేయొచ్చుకదా! అనే అంశంపై జగన్ తరఫు న్యాయవాదులు కోర్టులో లేవనెత్తడం ద్వారా.. ఈ కేసును మరో మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోందని న్యాయనిపుణులు చెబుతున్నారు.


ఈ విషయం కూటమి సర్కారుకు అంత ఈజీ అయితే కాదు. జగన్‌పై విమర్శలు చేసినంత ఈజీగా అదానీపై విమ ర్శలు చేసే అవకాశం లేదు. వాస్తవానికి ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని.. జగన్ న్యాయ పోరాటం చేస్తారని కూడా ఆలోచించ లేదు. ఈ క్రమంలోనే సీఎం, డిప్యూటీ సీఎం మినహా ఇతరులు మాత్రమే ఈ విషయంపై స్పందించారు.


సర్కారుకు రెండు రకాల ఇబ్బందులు వస్తున్నాయి. 1) లంచాలుతీసుకున్నారని జగన్‌పై కోర్టుకు చెబితే.. ఎవరు ఇచ్చారనే చర్చ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్‌గానే.. అదానీ పేరు తెరమీదికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది.. కూటమికి ఇస్టం లేదు. ఇక, 2) అసలు ఈ వ్యవహారంలో జగన్‌పాత్ర లేదని అంటే.. అలాంటప్పుడు.. ఆ రెండు పత్రికలు కూడా ఇబ్బందుల్లో కూరుకుపోతాయి.  ఏమీ లేనప్పుడు..ఎలా వ్యతిరేక వార్తలురాశారనే చర్చ వస్తుంది. ఈ క్రమంలో కూటమి సర్కారుకు ముఖ్యంగా చంద్రబాబుకు ఒకింత తలనొప్పులు ఏర్పడుతున్నాయని అంటున్నారు న్యాయనిపుణులు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూర్య కంగువ‌లో నటించిన ఈ నటి ఎవరో తెలుసా .. ఆమె అక్కడ చాలా ఫేమస్ బాసు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>