MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa-bc9406d0-8658-45be-abc8-c6b1b9afe7ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa-bc9406d0-8658-45be-abc8-c6b1b9afe7ba-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. దానితో ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాను రూపొందించారAa {#}Revanth Reddy;Hyderabad;Reddy;cinema theater;RTC;sukumar;Hero;Telangana;sandhya;Evening;Arjun;Allu Arjun;Cinema;Telangana Chief Minister;CM;Tollywood;police;December;Indiaఅల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్..?అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్..?Aa {#}Revanth Reddy;Hyderabad;Reddy;cinema theater;RTC;sukumar;Hero;Telangana;sandhya;Evening;Arjun;Allu Arjun;Cinema;Telangana Chief Minister;CM;Tollywood;police;December;IndiaFri, 13 Dec 2024 17:16:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. దానితో ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాను రూపొందించారు.

ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయగా ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీ రాత్రి నుండి కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించారు. ఇకపోతే ఈ సినిమాను హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లలో కూడా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో భాగంగా అల్లు అర్జున్ కూడా ఈ థియేటర్ కి విచ్చేశాడు. ఇక అల్లు అర్జున్ రావడంతో ఇక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. ఇక మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పందించాడు. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టుపై తాజాగా స్పందిస్తూ ... చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు. ఈ అరెస్టు విషయంలో తన జోక్యం ఏ మాత్రం లేదు అని ఆయన స్పష్టం చేశారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అని ఢిల్లీలో జరిగిన చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బెయిల్ మంజూరు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>