MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-family9fa0e9a5-0b25-4f85-ac6d-357180436e9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-family9fa0e9a5-0b25-4f85-ac6d-357180436e9b-415x250-IndiaHerald.jpgమంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదాలకు తెరపడేలా వారి కుటుంబ సన్నిహితులు గట్టి ప్రయత్నా లు చేస్తున్నట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది ఇక్క‌డితో ఆగ‌క పోతే జీవితాంతం ఇలాగే కొన‌సాగితే మంచు ఫ్యామిలీ ప‌రువు .. ప్ర‌తిష్ట‌లు పూర్తిగా మంట క‌లిసి పోతాయ‌ని వారు వాపోతున్నార‌ట‌. స‌న్నిహితుల ఒత్తిడి తో మోహన్ బాబు కూడా తన సన్నిహితులకు మనోజ్ తో సమస్య పరిష్కారానికి చర్చలు జరిపేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాక్‌. ఈ క్ర‌మంలో నే మనోజ్‌ కుటుంబం లో ఒంటరి కాదని ఆయనకు తల్లి తో పాటు సోదరి లక్ష్మి సపోర్టు కూడా ఉంద‌ని ప్Manchu family{#}Press;mounika;Father;vishnu;mohan babu;Tollywood;Indiaమంచు ఫ్యామిలీ డ్రామాకు ఇలా ఎండ్ కార్డు ప‌డ‌బోతోందా...?మంచు ఫ్యామిలీ డ్రామాకు ఇలా ఎండ్ కార్డు ప‌డ‌బోతోందా...?Manchu family{#}Press;mounika;Father;vishnu;mohan babu;Tollywood;IndiaThu, 12 Dec 2024 17:04:00 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదాలకు తెరపడేలా వారి కుటుంబ సన్నిహితులు గట్టి ప్రయత్నా లు చేస్తున్నట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది ఇక్క‌డితో ఆగ‌క పోతే జీవితాంతం ఇలాగే కొన‌సాగితే మంచు ఫ్యామిలీ ప‌రువు .. ప్ర‌తిష్ట‌లు పూర్తిగా మంట క‌లిసి పోతాయ‌ని వారు వాపోతున్నార‌ట‌. స‌న్నిహితుల ఒత్తిడి తో మోహన్ బాబు కూడా తన సన్నిహితులకు మనోజ్ తో సమస్య పరిష్కారానికి చర్చలు జరిపేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాక్‌.  ఈ క్ర‌మంలో నే మనోజ్‌ కుటుంబం లో ఒంటరి కాదని ఆయనకు తల్లి తో పాటు సోదరి లక్ష్మి సపోర్టు కూడా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు త‌ల్లి బ‌య‌ట‌కు రాలేదు.


మనోజ్ ధైర్యంగా ఇప్పటికీ ఇంట్లో నే ఉండటానికి తల్లే కారణమట‌. మనోజ్, మౌనిక కు పుట్టిన ఏడు నెల‌ల‌ బిడ్డను ఆమె సంరక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. మనోజ్ ను బయటకు పంపేయడానికి కుటుంబం తో సంబంధం లేదని చెప్పడానికి తల్లి నిర్మ‌ల‌మ్మ ఏ మాత్రం అంగీకరించే ప‌రిస్థితి లేదని చెబుతున్నారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చాలని అనుకున్నా కూడా..  టెస్టుల తర్వాత ఇంటికి వెంట‌నే రావ‌డానికి మనోజ్ బిడ్డ కోసమేనని చెబుతున్నారు.


అస‌లు గొడ‌వ ఏంటో ఇప్ప‌ట‌కీ క్లారిటీ లేదు. మ‌నోజ్ ఆస్తుల కోసం కాదంటారు. విష్ణు అయితే తండ్రి మాట జ‌వ దాట‌ను అంటారు. మ‌రి ఇంక గొడ‌వ‌లు ఎందుకో ? అర్థం కాదు. మ‌ధ్య‌లో ఉన్న పెద్ద మ‌నుషులు మ‌నోజ్ తో చర్చలు జరిపితే మనోజ్ తో సమస్య పరిష్కారం అయిపోతుదంని అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఇక సమస్యలు ఉండవని చెప్పే అవకాశం ఉందంటున్నారు. ఇక స‌మ‌స్య ప‌రిష్కారం అయినా కూడా కుటుంబం క‌ల‌వ‌డం క‌ష్ట‌మే అని ప‌లువురు అభిప్రాయ పడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2: ఆ ఒక్క రికార్డు మాత్రమే మిగిలింది.. పుష్పరాజ్ బ్రేక్ చేసేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>