PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nagababuce4d2b2b-4ead-4cb1-b556-d822314b0d5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nagababuce4d2b2b-4ead-4cb1-b556-d822314b0d5d-415x250-IndiaHerald.jpgఏపీ మంత్రివర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు త్వరలో చేరనున్నారు. పవన్ విజ్ఞప్తి మేరకు మంత్రివర్గంలోకి ఆయన్ను తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. సీఎంగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ తో పాటు 24 మంది ఈ ఏడాది జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆరోజే నాగబాబు కోసం ఒక మంత్రి పదవి రిజర్వ్ అయిందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. నాడు ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంచడంతో ఎవరి కోసమో? అన్న చర్చ అప్పట్లో జరిగింది. టీడీపీలో కొందరు టిక్కెట్ రాని వారికోసమో,nagababu{#}Nagababu;June;Tirupati;Pawan Kalyan;CBN;Cabinet;TDP;News;Janasena;Minister;Party;Rajya Sabhaనాగబాబు కోసం పదవిని ముందే రిజర్వ్ చేశారా? అందుకే మంత్రి ఎవరికీ కేటాయించలేదా?నాగబాబు కోసం పదవిని ముందే రిజర్వ్ చేశారా? అందుకే మంత్రి ఎవరికీ కేటాయించలేదా?nagababu{#}Nagababu;June;Tirupati;Pawan Kalyan;CBN;Cabinet;TDP;News;Janasena;Minister;Party;Rajya SabhaWed, 11 Dec 2024 11:57:00 GMTఏపీ మంత్రివర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు త్వరలో చేరనున్నారు.  పవన్ విజ్ఞప్తి మేరకు మంత్రివర్గంలోకి ఆయన్ను తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.  సీఎంగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ తో పాటు 24 మంది ఈ ఏడాది జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.  అయితే ఆరోజే నాగబాబు కోసం ఒక మంత్రి పదవి రిజర్వ్ అయిందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.


నాడు ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంచడంతో ఎవరి కోసమో? అన్న చర్చ అప్పట్లో జరిగింది. టీడీపీలో కొందరు టిక్కెట్ రాని వారికోసమో, లేక సీనియర్ల కోసమోనని భావించారు. చంద్రబాబు అందుకే ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచారని ప్రచారం జరిగింది. కానీ టీడీపీ నేతల అంచనాలు తలకిందులయ్యాయి. అది జనసేనకు నాడే ఓకే అయింది.  



నాగబాబుకు పదవి విషయంపై అనేక ప్రచారాలు జరిగాయి.  తొలుత తిరుపతి తిరుమల దేవస్థానం ఛైర్మన్ అని అన్నారు. తర్వాత రాజ్యసభకు ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడో డిసైడ్ అయినట్లుగానే నాగబాబుకు మంత్రిపదవి దక్కనుంది.  త్వరలోనే నాగబాబు చంద్రబాబు కేబినెట్ లో చేరనున్నారు.  ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవికి ఆయన ఎంపిక చేయనున్నారు.  ఆరు నెలల్లోపు చట్టసభలకు ఎంపిక కావాల్సి ఉండగా, అందుకోసమే ఇప్పుడు నాగబాబు పేరును ప్రకటించినట్లు అర్థమవుతుంది.  


ఐదు నెలల్లో ఐదు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి.  అందులో ఒకటి నాగబాబుకు కేటాయించనున్నారు. నిజానికి రాజ్యసభ సీటు జనసేన ఖాతాలోనే పడాల్సి ఉంది.  ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీకి, ఒకటి జనసేనకు అని భావించారు. కానీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించడం వల్ల ఆ ఒక్క స్థానాన్ని కూటమిలోని మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించారంటున్నారు.  మొత్తం మీద నాగబాబు పేరు ఎప్పుడో మంత్రివర్గంలో ఖరరాయిందని, అందుకు సమయం కోసం వేచి చూస్తూ ఇప్పుడు బయటపెట్టారని టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక త్వరలో మినిస్టర్ నాగబాబుగా మారబోతున్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రివెంజ్ తీర్చుకోవడానికి రెడీ అవుతున్న తారక్.. వ్యూహాలు ఫలించేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>