MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sankranti-war-882600a1-ec59-48a3-b889-0480b9db2545-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-sankranti-war-882600a1-ec59-48a3-b889-0480b9db2545-415x250-IndiaHerald.jpg వచ్చే సంక్రాంతికి విజేతగా ఈ యంగ్ హీరో లేక సీనియర్ హీరోలు నిలుస్తారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది . ఇక సంక్రాంతికి బాలకృష్ణ , వెంకటేష్ , రామ్ చరణ్ సినిమాలు పోటీ పడటం ఇది రెండోసారి .. 2019 సంక్రాంతికి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు , రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాతో పాటు వెంకటేష్ ఎఫ్2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి .. ఇక ఈ సంక్రాంతికి రామ్ చరణ్ , బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాలు గా నిలవగా.. వెంకటేష్ ఎఫ్2 మాత్రం సంక్రాంతి విన్నార్‌గా నిలిచింది . Sankranti war {#}Rayalaseema;NTR Kathanayakudu;Graphics;Research and Analysis Wing;Gautamiputra Satakarni;Seethamma Vakitlo Sirimalle Chettu;Narasimhanaidu;Gopala Gopala;Nayak;Mrugaraju;Annayya;Makar Sakranti;kalyan;Hanu Raghavapudi;Yevaru;Mass;Balakrishna;Success;mahesh babu;Ram Charan Teja;Chiranjeevi;Cinema;Venkatesh;Tollywood;Hero;Telugu;Industryఇప్పటివరకు సంక్రాంతి వార్‌లో బాలయ్య వర్సెస్ వెంకటేష్ .. ఎవరిది పై చేయి అంటే..?ఇప్పటివరకు సంక్రాంతి వార్‌లో బాలయ్య వర్సెస్ వెంకటేష్ .. ఎవరిది పై చేయి అంటే..?Sankranti war {#}Rayalaseema;NTR Kathanayakudu;Graphics;Research and Analysis Wing;Gautamiputra Satakarni;Seethamma Vakitlo Sirimalle Chettu;Narasimhanaidu;Gopala Gopala;Nayak;Mrugaraju;Annayya;Makar Sakranti;kalyan;Hanu Raghavapudi;Yevaru;Mass;Balakrishna;Success;mahesh babu;Ram Charan Teja;Chiranjeevi;Cinema;Venkatesh;Tollywood;Hero;Telugu;IndustryTue, 10 Dec 2024 16:12:00 GMTసంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడే ట్రెండ్ టాలీవుడ్ లో చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది .. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా సంక్రాంతి పోరు తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేస్తున్నాయి .. ముందుగా నటసింహం బాలకృష్ణ డాకుమాహారాజ్ , వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛెంజర్ మూవీ కూడా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి .. వచ్చే సంక్రాంతికి విజేతగా ఈ యంగ్ హీరో లేక సీనియర్ హీరోలు నిలుస్తారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది . ఇక సంక్రాంతికి బాలకృష్ణ , వెంకటేష్ , రామ్ చరణ్ సినిమాలు పోటీ పడటం ఇది రెండోసారి .. 2019 సంక్రాంతికి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు , రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాతో పాటు వెంకటేష్ ఎఫ్2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి .. ఇక ఈ సంక్రాంతికి రామ్ చరణ్ , బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాలు గా నిలవగా.. వెంకటేష్ ఎఫ్2 మాత్రం సంక్రాంతి విన్నార్‌గా నిలిచింది .


వెంకటేష్ వర్సెస్ బాలకృష్ణ కూడా 2019 కంటే ముందు .. గతంలో వెంకటేష్ సినిమాలు కొన్నిసార్లు సంక్రాంతి పోటీలో నిలిచాయి .. అలాగే ఈ ఇద్దరు హీరోలకి ఈ పండగ వారి కెరియర్లో మర్చిపోలేని విజయాలను .. అపజ‌యాలను కూడా అందించింది . ఇక ముందుగా 2000 సంవత్సరం సంక్రాంతికి బాలకృష్ణ వంశోద్ధారకుడు , వెంకటేష్ కలిసుందాం రా సినిమాలు వచ్చాయి .. బాలయ్య వంశోద్ధారకుడు సినిమా మాస్ కథతో రాగా వెంకటేష్ కలిసుందాం రా ఫ్యామిలీ డ్రామాగా వచ్చి బాలకృష్ణకు భారీ షాక్ ఇచ్చింది .. ఈ సంక్రాంతికి వెంకటేష్ సినిమా సూపర్ హిట్ అయింది .. అలాగే అదే సంవత్సరం సంక్రాంతికి చిరంజీవి హీరోగా వచ్చిన అన్నయ్య సినిమా కూడా హిట్ అయింది . అలాగే 2001లో మరోసారి బాలకృష్ణ నరసింహనాయుడు , వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు . భారీ బడ్జెట్లో గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన దేవీపుత్రుడు ప్రేక్షకులను మెప్పించలేక బోల్తా కొట్టింది .. అదే స‌మ‌యంలో నరసింహనాయుడు సినిమా బాలకృష్ణ కెరీర్‌లో  టాలీవుడ్ లోనే ఇండస్ట్రీ హిట్గా నిలిచింది .. అలాగే ఈ సినిమాలతో పాటుగా చిరంజీవి నటించిన మృగరాజు కూడా ఈ సంక్రాంతికి వచ్చి డిజాస్టర్ గా మిగిలింది.
 

ఇక 2001 తర్వాత బాలకృష్ణ , వెంకటేష్ సంక్రాంతి వార్‌కు బ్రేక్ పడింది .. ఇద్దరిలో ఒకరి సినిమా మాత్రమే సంక్రాంతికి రిలీజ్ అవుతూ వచ్చింది .. 2002 పండగ సీజన్లో బాలయ్య నటించిన సీమ సింహం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది .. ఇక 2004లో మాత్రం లక్ష్మీనరసింహ సినిమాతో బాలయ్య మరోసారి సంక్రాంతి విజేతగా రికార్డులు తిరగ రాశాడు . అలాగే 2006 సంక్రాంతికి లక్ష్మీతో వెంకటేష్ సంక్రాంతికి వ‌చ్చి భారీ హీట్ అందుకున్నాడు . ఇక 2008 సంక్రాంతి సీజన్ బాలకృష్ణకు అసలు కలిసి రాలేదు .. వైవీఎస్ చౌద‌రి దర్శకత్వంలో వచ్చిన ఒక్కమగాడు బాలయ్య కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా నిలిచింది.  తర్వాత 2008 సంక్రాంతికి వెంకటేష్ నమో వెంకటేశ సినిమాతో వచ్చి మరో హిట్ను తన ఖాతాలు వేసుకున్నాడు .. అలాగే 2011లో వచ్చిన బాలకృష్ణ పరమవీరచక్ర మరోసారి సంక్రాంతికి భారీ ఫ్లాప్ ని మిగిల్చింది. ఇదే క్రమంలో 2013లో రామ్ చరణ్ ఎవడు , వెంకటేష్ , మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సంక్రాంతి పోటీలో నిలిచాయి ..


ఇక సీత్తమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవగా .. నాయక్ సినిమా మాస్ ప్రేక్షకులను మెప్పించింది .. ఆ తర్వాత సంక్రాంతికి రామ్ చరణ్ ఎవడు సినిమాతో వచ్చి హిట్టు టాక్ తెచ్చుకున్నాడు. 2015 సంక్రాంతి సెంటిమెంట్ వెంకటేష్ కు బాగా కలిసి వచ్చింది .. గోపాల గోపాల ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించింది .. పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో కనిపించడం ఈ సినిమాకు ప్లస్ అయింది .. ఇక 2017తో పాటు 2023 సంక్రాంతికి చిరంజీవితో బాలకృష్ణ పోటీపడ్డారు ఈ వార్‌లో బాలకృష్ణకు రెండుసార్లు సక్సెస్ లు వచ్చాయి .. ఇక 2017 లో రిలీజ్ అయిన గౌతమీపుత్ర శాతకర్ణి , 2023 లో వచ్చిన విరసింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ రాబట్టాయి.   ఇప్పుడు వచ్చే సంక్రాంతి వార్‌లో ఈ హీరోల్లో ఎవరు పైచే సాదిస్తారు అనేది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇప్పటివరకు సంక్రాంతి వార్‌లో బాలయ్య వర్సెస్ వెంకటేష్ .. ఎవరిది పై చేయి అంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>