PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap4c4d8832-4eda-4fab-9f09-41a6eddcd5eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap4c4d8832-4eda-4fab-9f09-41a6eddcd5eb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల అందించే దీపం పథకానికి శ్రీకారం చుట్టగా.. మిగిలిన పథకాలపైనా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మరో ముఖ్యమైన పథకం ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకాన్ని ఆగస్టు 15కి ప్రారంభిస్తారని భావించారు.. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు తన ఫేస్ బుక్ లో సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మap{#}venkat rao;Makar Sakranti;Andhra Pradesh;RTC;Industries;bus;Telangana Chief Minister;MLA;Governmentఏపీ: ఉచిత బస్సు పధకానికి డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే.?ఏపీ: ఉచిత బస్సు పధకానికి డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచంటే.?ap{#}venkat rao;Makar Sakranti;Andhra Pradesh;RTC;Industries;bus;Telangana Chief Minister;MLA;GovernmentTue, 10 Dec 2024 06:15:00 GMTఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల అందించే దీపం పథకానికి శ్రీకారం చుట్టగా.. మిగిలిన పథకాలపైనా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మరో ముఖ్యమైన పథకం ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకాన్ని ఆగస్టు 15కి ప్రారంభిస్తారని భావించారు.. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు తన ఫేస్ బుక్ లో సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం పథకాన్ని అమలు చేయబోతున్నట్లుపోస్ట్ పెట్టారు.పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రీ బస్ వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే పనిలో ఉందని వెల్లడించారు.ఇదిలావుండ గా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని,ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని గుర్తు చేశారు. సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంతో మహిళలు ఆనందంలో ఉన్నారన్నారు.అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ప్రభుత్వం.. ఇప్పటికే కసరత్తు చేసింది. ఈ పథకం అమలవుతున్న తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలో ఆర్టీసీ అధికారులు పర్యటించారు.. అక్కడ పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ఈ మేరకు నివేదికను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. అయితే ప్రభుత్వం కొత్త బస్సుల్ని కొనుగోలు చేస్తోంది.. అన్ని డిపోల్లో అవసరం మేరకు బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాక్: మనోజ్- మౌనికల గురించి విస్తుపోయే నిజాలు చెప్పిన మోహన్ బాబు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>