DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/revanth69bd84b7-9381-4e67-836f-e5235d59da9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/revanth69bd84b7-9381-4e67-836f-e5235d59da9f-415x250-IndiaHerald.jpgతెలంగాణ మన అస్తిత్వం అంటూ టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పోరాడింది. అనుకున్నట్లుగా తెలంగాణ సాధించి పదేళ్లపాటు అధికారంలో కొనసాగింది. అయితే.. అధికారంలో ఉన్న పదేళ్లపాటు తెలంగాణ తల్లి విగ్రహానికి ఓ రూపాన్ని ఎందుకు తీసుకురాలేకపోయిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం.. అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ క్రెడిట్ కొట్టేశారు. దశాబ్ద కాలం తరువాత కాంగ్రెస్ను ప్రజలు ఆదరించారు. దాంతో ఎక్కడ కూడా తెలంగాణవాదాన్ని చిన్నచూపు చూడడం లేదు. తెలంగాణవాదులకు ప్రాధాన్యం ఇస్తూనే ముrevanth{#}Telangana Rashtra Samithi TRS;gold;revanth;Telangana;Revanth Reddy;Congress;Government;Telangana Chief Minister;Reddy;Racchaతెలంగాణ తల్లి మార్పు రేవంత్ కి చేటు తెస్తుందా?తెలంగాణ తల్లి మార్పు రేవంత్ కి చేటు తెస్తుందా?revanth{#}Telangana Rashtra Samithi TRS;gold;revanth;Telangana;Revanth Reddy;Congress;Government;Telangana Chief Minister;Reddy;RacchaMon, 09 Dec 2024 11:28:22 GMTతెలంగాణ మన అస్తిత్వం అంటూ టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పోరాడింది.   అనుకున్నట్లుగా తెలంగాణ సాధించి పదేళ్లపాటు అధికారంలో కొనసాగింది. అయితే..  అధికారంలో ఉన్న పదేళ్లపాటు తెలంగాణ తల్లి విగ్రహానికి ఓ రూపాన్ని ఎందుకు తీసుకురాలేకపోయిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం.. అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ క్రెడిట్ కొట్టేశారు.


దశాబ్ద కాలం తరువాత కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించారు. దాంతో ఎక్కడ కూడా తెలంగాణవాదాన్ని చిన్నచూపు చూడడం లేదు. తెలంగాణవాదులకు ప్రాధాన్యం ఇస్తూనే ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణతల్లి విగ్రహానికి ఓ రూపాన్ని తీసుకొచ్చారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు పట్టించుకోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి రెడీ చేయించారు.



ఆకుపచ్చ చీరలో.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా విగ్రహాన్ని రెడీ చేయించారు. ఎలాంటి నగ, ఎలాంటి బంగారు కిరీటాలు లేకుండా సింపుల్‌గా తెలంగాణ మహిళ రూపంతో సిద్ధం చేయించారు. రేపు ఎంతో అట్టహాసంగా సెక్రటేరియట్‌లో ఆవిష్కరించబోతున్నారు. అయితే.. ఇక్కడే రేవంత్ రెడ్డి వ్యవహరించిన చాకచక్యాన్ని సైతం అందరూ అభినందిస్తున్నారు. విగ్రహం నమూనాను ముందే విడుదల చేస్తే ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వస్తాయి. వారు రచ్చ చేయాలనే చూస్తారు. అందువల్ల రేవంత్ విగ్రహావిష్కరణకు మూడు రోజుల ముందు మాత్రమే నమూనాను విడుదల చేశారు. ఇదే సందర్భంలో ప్రజల నుంచి వస్తున్న టాక్‌ను మాత్రమే వీరు లెక్కల్లోకి తీసుకుంటున్నారు.


కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రజల నుంచి మంచి స్పందనే వస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతీ తెలంగాణ గ్రామీణ మహిళ కూడా ఆ విగ్రహంలో తమను తాము చూసుకొని మురిసిపోతున్నారని అంటున్నారు. కిరీటాలు, నగల జోలికి పోకుండా.. తమ ఇంటి ఆడబిడ్డనే తెలంగాణ తల్లి అని భావించి.. అదే రూపంలో విగ్రహం ఉండాలని రేవంత్ భావించారు.


బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ వ్యతిరేకులు సాధారణంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బోనం లేదని, బతుకమ్మ లేదని, సిరిసంపదలు ఏవీ లేవని రకరకాల వాదనలు పెడుతున్నారు.  








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

' పుష్ప 2 ' స్క్రీనింగ్ ప్రేక్ష‌కుల‌కు వింత అనుభ‌వం.. సెకెండ్ హ‌ఫ్‌తో సినిమా కంప్లీట్‌.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>