Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas277f8ca1-51f9-465b-9448-230e621d2bb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas277f8ca1-51f9-465b-9448-230e621d2bb1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ఈ క్రమంలో ప్రభాస్ నటనకు ఒక్క తెలుగులోనే కాకుండా యావత్ దేశమంతటా అభిమానులు, అభిమాన సంఘాలు తయారయ్యాయి అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. దాంతోనే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతుండటం విశేషం. కాగా ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' అనPrabhas{#}Darling;Eshwar;Rishabh Pant;KGF;Bahubali;Darsakudu;Prabhas;contract;Director;News;Indiaప్రభాస్ కోసం కథ రాసిన మరో పాన్ ఇండియా స్టార్ హీరో.. ఇంతకీ ఎవరంటే?ప్రభాస్ కోసం కథ రాసిన మరో పాన్ ఇండియా స్టార్ హీరో.. ఇంతకీ ఎవరంటే?Prabhas{#}Darling;Eshwar;Rishabh Pant;KGF;Bahubali;Darsakudu;Prabhas;contract;Director;News;IndiaMon, 09 Dec 2024 17:13:00 GMTటాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ఈ క్రమంలో ప్రభాస్ నటనకు ఒక్క తెలుగులోనే కాకుండా యావత్ దేశమంతటా అభిమానులు, అభిమాన సంఘాలు తయారయ్యాయి అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. దాంతోనే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతుండటం విశేషం. కాగా ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకోసం జనాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ప్రభాస్... నటుడు, దర్శకుడు అయినటువంటి రిషబ్ శెట్టి చెప్పినటువంటి ఓ కథ, చాలా నచ్చడంతో సదరు కధకి పచ్చజెండా ఊపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొద్ది రోజులుగా రిషబ్ శెట్టి ఈ కథ గురించి పని చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక దీనిని కేజిఎఫ్ మరియు కాంతార వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన హోంభలే సంస్థ నిర్మించబోతున్నట్టు భోగట్టా. కాగా ఈ నిర్మాణ సంస్థలో ప్రభాస్ ఇప్పటికే 3 సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రభాస్ ఇమేజ్ ని మరింత పెంచేలా స్క్రిప్ట్ ని సిద్ధం చేయాలని అనుకుంటున్నారట.

ఇక దాని కొరకు నటుడు, దర్శకుడు అయినటువంటి రిషబ్ శెట్టిని కలిసి ఓ మంచి కథను అందించమని కోరగా అతను తప్పకుండా మంచి కథను డార్లింగ్ కోసం ఇస్తానని హామీ ఇవ్వడమే కాకుండా, అనుకున్నదే తడవుగా ప్రభాస్ ని కలిసి ఓ లైన్ వినిపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ లైన్ నచ్చడంతో ప్రభాస్ ఆ కధలో తప్పక నటిస్తానని చెప్పుకొచ్చాడట. అయితే ఆ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా రిషబ్ శెట్టి రాసుకున్న కథలో ప్రభాస్ నటించనున్నాడనే వార్త బయటకి వచ్చినప్పటి నుండీ అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి.. రోజా స్థానం భర్తీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>