MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mohanbabu9909d50e-62df-4e67-9920-45b6d10cc7da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mohanbabu9909d50e-62df-4e67-9920-45b6d10cc7da-415x250-IndiaHerald.jpgకలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అంటూ తన విలక్షణ నటన తో ఎంతగానో పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు మెహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇదిలావుండగా ఆదివారం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా షాక్‌కి గురైంది. మంచు ఫ్యామిలీలో ఎన్నడూ లేని విధంగా ఓ షాకింగ్ ఘటన టాలీవుడ్‌ని షేక్ చేసింది.మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్‌ల మధ్య దాడి జరిగిందని ఈ దాడిలో మోహన్ బాబు తన అనుచరులతో మనోజ్‌పై దాడి చేయించారనేలా వార్తలు వైరల్ అయ్యాయి.అయితే ఆ కాసేపటికే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తరపు నుండి ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదనేలా ఓmohanbabu{#}manchu manoj kumar;kusuma jagadish;dasari narayana rao;editor mohan;mohan babu;king;King;police;prasad;Hyderabad;producer;Producer;Chitram;Industry;Nijam;Wife;CBN;media;Father;News;sunday;Cinemaవైరల్ అవుతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పోస్ట్.!వైరల్ అవుతున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పోస్ట్.!mohanbabu{#}manchu manoj kumar;kusuma jagadish;dasari narayana rao;editor mohan;mohan babu;king;King;police;prasad;Hyderabad;producer;Producer;Chitram;Industry;Nijam;Wife;CBN;media;Father;News;sunday;CinemaMon, 09 Dec 2024 08:47:00 GMTకలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అంటూ తన విలక్షణ నటన తో ఎంతగానో పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు మెహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇదిలావుండగా ఆదివారం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా షాక్‌కి గురైంది. మంచు ఫ్యామిలీలో ఎన్నడూ లేని విధంగా ఓ షాకింగ్ ఘటన టాలీవుడ్‌ని షేక్ చేసింది.మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్‌ల మధ్య దాడి జరిగిందని ఈ దాడిలో మోహన్ బాబు తన అనుచరులతో మనోజ్‌పై దాడి చేయించారనేలా వార్తలు వైరల్ అయ్యాయి.అయితే ఆ కాసేపటికే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తరపు నుండి ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదనేలా ఓ వార్త వచ్చింది.కానీ మంచు మనోజ్ మాత్రం తనపై తన తండ్రి దాడి చేయించినట్లుగా మీడియా ముందు ప్రకటించడమే కాకుండా.. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయబోతున్నట్లుగా ప్రకటించారు.మరోవైపు మంచు మనోజ్ నుండి 100కు కాల్ వచ్చినట్లుగా పోలీసులు కూడా ధ్రువీకరించినట్లుగా వార్తలు వచ్చాయి.దీంతో మంచు ఫ్యామిలీలో మంటలు నిజమే అనేది క్లారిటీ వచ్చేసింది.అయితే ఇక్కడ మంచు మనోజ్ హడావుడి చేస్తున్నాడు తప్పితే మోహన్ బాబు సైడ్ నుండి కొంచెం అంటే కొంచెం కూడా కదలిక లేదు.

అయితే అదే సమయంలో సోషల్ మీడియా ఎక్స్‌లో ఆయన చేసిన పోస్ట్ చూస్తే ఆయనసలు ఈ విషయాన్ని పట్టించుకున్నట్టే కనిపించలేదు. మరోవైపు మంచు మనోజ్ మాత్రం తనపై తన తండ్రి మోహన్ బాబు అనుచరుడైన వినయ్ కొంత మందితో వచ్చి తనపై దాడి చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు, తన భార్య మౌనికతో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న టిఎక్స్ హాస్పిటల్‌లో మనోజ్ జాయిన్ అయ్యారు. తన భార్య, టీమ్‌తో కలిసి మనోజ్ హాస్పిటల్‌కు వెళుతున్న వీడియో బయటికి రావడంతో నిజంగానే మనోజ్‌పై దాడి జరిగి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం డాక్టర్స్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మంచు మనోజ్ రచ్చ ఇలా ఉంటే మోహన్ బాబు మాత్రం తాపీగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మంచు మోహన్ బాబు తాజాగా తన ఎక్స్‌లో 1979లో ఆయన నటించిన 'కోరికలే గుర్రాలైతే' అనే మూవీలోని ఓ సన్నివేశాన్ని షేర్ చేసి కోరికలే గుర్రాలైతే మూవీలోని సన్నివేశం. నా గురువు, లెజెండరీ శ్రీ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మాత శ్రీ. జి. జగదీష్ చంద్ర ప్రసాద్ గారు నిర్మించారు. ఈ సన్నివేశం నా కెరీర్‌లో ఓ ప్రత్యేక మైలురాయి. ఇందులో చంద్రమోహన్ మరియు మురళీ మోహన్ గార్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు మరింత గుర్తుండిపోయే అంశం. అలాగే తొలిసారి యమధర్మరాజు పాత్ర చేయడం మరచిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం నాకు సవాలుగానూ మరియు సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రం నా ప్రయాణంలో ప్రతిష్టాత్మకంగా నిలిచింది అని పేర్కొన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"పుష్ప 2" కోసం ఫ్యాన్స్ భారీ క్యూ.. ఇది కదా అభిమానమంటే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>