MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/amaran47acc1e9-c18c-4bfe-a199-2e79995497f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/amaran47acc1e9-c18c-4bfe-a199-2e79995497f6-415x250-IndiaHerald.jpgశివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీలో పనిచేస్తూ అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్‌కుమార్ పెరియస్వామి ఈ సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్‌ బ్యానర్ తో కలిసి ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు నెల రోజుల పాటు థియేటర్లలో రన్ అయ్యి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. శివకార్తికేయన్ కెరీర్‌లో అత్యamaran{#}Shiva;bhuvan;jeevitha rajaseskhar;Diwali;Sony;Qatar;lord siva;Sai Pallavi;NET FLIX;shyam;rahul;Rahul Sipligunj;Varsham;October;Wife;Chitram;Cinemaఓటీటీలో దుమ్ముదులుపుతూ రికార్డ్ సృష్టిస్తున్న సూపర్ హిట్ మూవీ.!ఓటీటీలో దుమ్ముదులుపుతూ రికార్డ్ సృష్టిస్తున్న సూపర్ హిట్ మూవీ.!amaran{#}Shiva;bhuvan;jeevitha rajaseskhar;Diwali;Sony;Qatar;lord siva;Sai Pallavi;NET FLIX;shyam;rahul;Rahul Sipligunj;Varsham;October;Wife;Chitram;CinemaMon, 09 Dec 2024 10:00:00 GMTశివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీలో పనిచేస్తూ అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్‌కుమార్ పెరియస్వామి ఈ సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్‌ బ్యానర్ తో కలిసి ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు నెల రోజుల పాటు థియేటర్లలో రన్ అయ్యి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. శివకార్తికేయన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులోనూ అదరగొట్టిన అమరన్ సుమారు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అమరన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ అదరగొడుతుంది. ఇండియా, సింగపూర్, శ్రీలంకలో నెంబర్ -1స్థానం లో ట్రెండ్ అవుతుంది. మొత్తం గా 14దేశాల్లో టాప్ -10లిస్ట్ లో కొనసాగుతుంది. మలేషియా, మల్దీవ్స్, నైజిరియా, యూఏఈ లో రెండు, ఖతార్ లో 3,పాకిస్థాన్ లో 5,గ్లోబల్ గా 10వ స్థానం లో స్ట్రీమింగ్ అవుతుంది.ఇదిలావుండగా అమరన్ సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతంగా నటించాడు. ఈ పాత్ర కోసం తన లుక్ ను కూడా పూర్తిగా మార్చుకున్నాడీ స్టార్ హీరో. ఇక వరదరాజన్ భార్య ఇందూ రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. వీరితో పాటు రాహుల్ బోస్, భువన్ అరోరా, శ్యామ్ ప్రసాద్ వంటి ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించి మెప్పించారు. మరి థియేటర్లలో అమరన్ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మలైకా అరోరా: కొత్త బాయ్ ఫ్రెండ్ తో చక్కెర్లు కొడుతున్న బాలీవుడ్ నటి.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>