Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpa2157c59f2-bbe2-4a41-9c8c-6a70603f452f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpa2157c59f2-bbe2-4a41-9c8c-6a70603f452f-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.. తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రిలీజ్ కు ముందు విపరీతమైన అంచనాలు నెలకొన్న ఈ సినిమా.. ప్రస్తుతం అదే రేంజ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఫస్ట్ డే ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్ లోనే అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసిన ఈ సినిమా.. అత్యంత pushpa2{#}Blockbuster hit;rashmika mandanna;sukumar;Allu Arjun;media;India;Cinemaవావ్ : కిస్సిక్ పాటకి 'బామ్మలు' స్టెప్స్ అదరగొట్టారుగా..!!వావ్ : కిస్సిక్ పాటకి 'బామ్మలు' స్టెప్స్ అదరగొట్టారుగా..!!pushpa2{#}Blockbuster hit;rashmika mandanna;sukumar;Allu Arjun;media;India;CinemaMon, 09 Dec 2024 11:10:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.. తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రిలీజ్ కు ముందు విపరీతమైన అంచనాలు నెలకొన్న ఈ సినిమా.. ప్రస్తుతం అదే రేంజ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఫస్ట్ డే ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్ లోనే అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసిన ఈ సినిమా.. అత్యంత వేగంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించాన సినిమా గాను రికార్డులు సృష్టించింది.అయితే ఈ సినిమా విడుదల కంటే ముందే సోషల్ మీడియాలో సెన్సెషన్ అయ్యాయి ఈ మూవీ సాంగ్స్. పుష్ప పుష్పరాజ్ నుంచి మొన్న విడుదలైన కిస్సిక్, పీలింగ్స్ పాటలకు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలోని పాటకు సైతం వరల్డ్ వైడ్ ఫేమ్ వచ్చింది.ఇక ఈ సినిమాలో శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ నెట్టింట చాలా ఫేమస్ అయ్యింది. ఇక ఈసాంగ్ థియేటర్లలో కుర్రకారును ఓ ఊపు ఊపేస్తుంది. ఈ పాటకు చిన్నా, పెద్ద తేడా లేకుండా నెట్టింట రీల్స్ చేస్తున్నారు. అయితే తాజాగా కిస్సిక్ పాటకు బామ్మలు అదరగొట్టారు. దెబ్బలు పడతాయిరో.. అంటూ స్టెప్పులు వేశారు. కర్ణాటక బెలగాంలో ఉన్న శాంతయి వృద్ధాశ్రమంలో ఉన్న కొందరు బామ్మలు కిస్సిక్ పాటకు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేయగా.. ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. బామ్మలు వేసిన స్టెప్స్ అదిరిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఇదిలావుండగా ఈ ఆశ్రమంలోని బామ్మలు, తాతయ్యలు రీల్స్ చేయడం మొదటిసారి కాదు. ఇప్పటికే పలు పాటలకు స్టెప్పులు వేశారు. అలాగే ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. శాంతయి వృద్ధాశ్రమం సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదోకటి పోస్ట్ చేస్తుంటారు. శాంతి సెకండ్ చైల్డ్ హుడ్ అనే పేరుతో ఉన్న ఈ సోషల్ మీడియా ఖాతాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మలైకా అరోరా: కొత్త బాయ్ ఫ్రెండ్ తో చక్కెర్లు కొడుతున్న బాలీవుడ్ నటి.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>