LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/eat--health-within--time-studyb00d5fae-5aef-468c-b70a-5e888997c903-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/eat--health-within--time-studyb00d5fae-5aef-468c-b70a-5e888997c903-415x250-IndiaHerald.jpgచిన్నవయసులోనే ప్రతి ఆహారాన్ని తింటాము. పెద్దయ్యాక చాలా ఆహారాలను మానేస్తాము. ఏ వయసులోనైనా కానీ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. మనం ఆరోగ్యంగా జీవించాలంటే రోజు మూడు పూటల ఆహారం తినాల్సిందే. అయితే అధికంగా తిన్నా, మరీ తక్కువగా తిన్న హెల్త్ పరంగా నష్టపోతాం. ఇవే కాకుండా సమయానికి తినకపోవడం, రాత్రులు ఆలస్యంగా తినడం కూడా ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. లేట్ గా తినే డయాబెటిస్ సహా పలు రకాల హెల్త్ ఇష్యూస్ పెరుగుతాయని స్పయిన్రాని యూనివర్సిటీ ఆఫ్ కాటలోనియా, అలాగే కొలంబియా యూeat ; health; within ; time; study{#}Colombia;Insulin;Sugar;Evening;University;Manamఈ టైమ్ లోగా తినకపోతే రిస్క్ లో పడ్డట్లే... అధ్యాయనంలో షాకింగ్ విషయాలు..!ఈ టైమ్ లోగా తినకపోతే రిస్క్ లో పడ్డట్లే... అధ్యాయనంలో షాకింగ్ విషయాలు..!eat ; health; within ; time; study{#}Colombia;Insulin;Sugar;Evening;University;ManamMon, 09 Dec 2024 18:45:05 GMTచిన్నవయసులోనే ప్రతి ఆహారాన్ని తింటాము. పెద్దయ్యాక చాలా ఆహారాలను మానేస్తాము. ఏ వయసులోనైనా కానీ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. మనం ఆరోగ్యంగా జీవించాలంటే రోజు మూడు పూటల ఆహారం తినాల్సిందే. అయితే అధికంగా తిన్నా, మరీ తక్కువగా తిన్న హెల్త్ పరంగా నష్టపోతాం. ఇవే కాకుండా సమయానికి తినకపోవడం, రాత్రులు ఆలస్యంగా తినడం కూడా ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. లేట్ గా తినే డయాబెటిస్ సహా పలు రకాల హెల్త్ ఇష్యూస్ పెరుగుతాయని స్పయిన్రాని యూనివర్సిటీ ఆఫ్ కాటలోనియా,

 అలాగే కొలంబియా యూనివర్సిటీ నిపుణుల ఆధ్యాయంలోనూ వెళ్లడైంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం. కొందరు రాత్రి భోజనాన్ని మరీ ఆలస్యంగా 11 గంటలలోపు ఎప్పుడైనా తింటుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు పరిశోధకులు. శరీరంలో గ్లూకోస్ జీవక్రియకు, ఇన్సులిన్ పనితీరుకు ఆటంకం ఏర్పడుతుందని, ఫలితంగా రోజు ఆలస్యంగా తినేవారిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని చెబుతున్నారు. సాయంకాలం 6 నుంచి 8 గంటలలోపు ఆహారం తీసుకుంటే క్యాలరీలో 45 శాతానికి పైగా రక్తంలో చక్కెర స్థాయిల లెవెల్స్ పై సానుకూల ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

కాగా ఆలస్యంగా తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. రాత్రిపూట బాడీలో తక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ కావటం వల్ల గ్లూకోస్ ను శోషించే ఎనర్జీని శరీరం కోల్పోతుంది. ఆధ్యాయంలో భాగంగా పరిశోధకులు 50 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసుగల 26 మందిని రెండు గ్రూపులుగా విభజించారు. వీరిలో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు, లేనివారు కూడా ఉన్నారు. కాగా వీరిద్దరికీ ఒకే రకమైన ఆహారాన్ని ఇచ్చారు. అయితే ఒక గ్రూపు వారు త్వరగా, మరో గ్రూప్ వారు రాత్రి ఆలస్యంగా తినాలని రీసర్చర్స్ సూచించారు. కొంతకాలం తరువాత వారి హెల్త్ డేటాను విశ్లేషించిన పరిశోధకులు, రాత్రిపూట ఆలస్యంగా తింటున్నా వారిలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నట్లు గుర్తించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి.. రోజా స్థానం భర్తీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>