Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/sleeping-late-can-cause-numerous-health-problems-you-should-follow-this-sleep-routineb4a98327-0742-4b13-9d65-d219aeb09f38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/sleeping-late-can-cause-numerous-health-problems-you-should-follow-this-sleep-routineb4a98327-0742-4b13-9d65-d219aeb09f38-415x250-IndiaHerald.jpgఆలస్యంగా పడుకోవడం ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట చాలా సేపు మెలకువగా ఉండి, ఉదయం లేట్ గా లేచే అలవాటు ఉన్నవారికి అన్ని రకాల వ్యాధులు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ అలవాటు కారణంగా గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం ఒక గడియారంలా పనిచేస్తుంది. ఈ గడియారాన్ని 'సర్కేడియన్ రిథమ్' అంటారు. రాత్రి పూట నిద్రపోయి, ఉదయం లేచేటప్పుడు ఈ గడియారం సరిగ్గా పని చేస్తుంది. కానీ, రాత్రి పూట నిద్ర లేకపోతే ఈ గlate sleep{#}Heartఅర్ధరాత్రి వరకు నిద్రపోవట్లేదా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే.. ఇది తెలుసుకోండి?అర్ధరాత్రి వరకు నిద్రపోవట్లేదా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే.. ఇది తెలుసుకోండి?late sleep{#}HeartSun, 08 Dec 2024 15:40:00 GMTఆలస్యంగా పడుకోవడం ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట చాలా సేపు మెలకువగా ఉండి, ఉదయం లేట్ గా లేచే అలవాటు ఉన్నవారికి అన్ని రకాల వ్యాధులు వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ అలవాటు కారణంగా గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

మన శరీరం ఒక గడియారంలా పనిచేస్తుంది. ఈ గడియారాన్ని 'సర్కేడియన్ రిథమ్' అంటారు. రాత్రి పూట నిద్రపోయి, ఉదయం లేచేటప్పుడు ఈ గడియారం సరిగ్గా పని చేస్తుంది. కానీ, రాత్రి పూట నిద్ర లేకపోతే ఈ జీవ గడియారం గందరగోళానికి గురవుతుంది. దీంతో మన శరీరంలోని చక్కెర స్థాయిలు అదుపు తప్పి, గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీర్ఘకాలంగా ఇలాంటి అలవాట్లు కొనసాగిస్తే, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ప్రముఖ హార్ట్ సర్జన్ మాట్లాడుతూ "నిద్ర అనేది మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశం. మన శరీరం ఒక యంత్రంలా నిత్యం పని చేయలేదు. కాబట్టి, ఆరోగ్యంగా ఉండాలంటే సరిగ్గా నిద్రపోవడం చాలా ముఖ్యం. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
కాబట్టి, ఈ రోజు నుండి నిద్ర అలవాట్లను మార్చుకుని, ఆరోగ్యంగా ఉండండి." అని చెప్పారు.

రాత్రి పూట ఆలస్యంగా పడుకుంటూ, వారాంతాల్లో ఎక్కువ సేపు నిద్రపోయి ఆ సమయాన్ని సరిచేసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది సరైన పద్ధతి కాదు. వీకెండ్స్‌లో ఎక్కువగా నిద్రపోవడం వల్ల మన శరీరంలోని గడియారం మరింత బ్యాలెన్స్ తప్పుతుంది. దీంతో మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది.

స్లీప్ హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయం ప్రకారం, ప్రతి రోజూ ఒకే సమయంలో పడుకోవడం, ఒకే సమయంలో లేవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మన శరీరం సరిగ్గా పని చేస్తుంది. లేకపోతే ఏకాగ్రత తగ్గుతుంది, బరువు పెరిగే ప్రమాదం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలంగా ఇలాంటి అలవాట్లు కొనసాగిస్తే, మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది. కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు కంటి నిండా నిద్రపోవాలి. ఇలా నిద్రపోతుంటే శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ట్రెండ్ మారింది.. మళ్ళీ పెర్ఫార్మన్స్ రోల్స్ తో స్టార్ హీరోస్ సరికొత్త ప్రయోగం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>