Technologypraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-internet64bf57fd-3a06-4565-91ce-1d0a0337779e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-internet64bf57fd-3a06-4565-91ce-1d0a0337779e-415x250-IndiaHerald.jpgమన ఫోన్‌లలో ఇంటర్నెట్‌ని వాడాలంటే వైఫై లేదా మొబైల్ డేటా అనే రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండింటిలో వై-ఫై అనేది మన ఫోన్‌ బ్యాటరీకి మంచిది. అదే ఎందుకో తెలుసుకుందాం పదండి. మన ఫోన్‌ ఇంటర్నెట్ సిగ్నల్‌ని నిత్యం పొందడానికి మొబైల్ టవర్‌లని వెతకాలి. ఈ ప్రక్రియ ఎక్కువ శక్తిని వాడుతుంది. అంతేకాదు, 3G, 4G, 5G లాంటి వేర్వేరు నెట్‌వర్క్‌ల మధ్య మారుతున్నప్పుడు ఇంకా ఎక్కువ బ్యాటరీ వృథా అవుతుంది.mobile internet{#}5G;you tube;Shakti;Smart phone;Manamమొబైల్ డేటా, వైఫై రెండింటిలో.. ఏది వాడితే ఫోన్ బ్యాటరీకి మంచిది?మొబైల్ డేటా, వైఫై రెండింటిలో.. ఏది వాడితే ఫోన్ బ్యాటరీకి మంచిది?mobile internet{#}5G;you tube;Shakti;Smart phone;ManamSun, 08 Dec 2024 14:19:00 GMTమన ఫోన్‌లలో ఇంటర్నెట్‌ని వాడాలంటే వైఫై లేదా మొబైల్ డేటా అనే రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండింటిలో వై-ఫై అనేది మన ఫోన్‌ బ్యాటరీకి మంచిది. అదే ఎందుకో తెలుసుకుందాం పదండి. మన ఫోన్‌ ఇంటర్నెట్ సిగ్నల్‌ని నిత్యం పొందడానికి మొబైల్ టవర్‌లని వెతకాలి. ఈ ప్రక్రియ ఎక్కువ శక్తిని వాడుతుంది. అంతేకాదు, 3G, 4G, 5g లాంటి వేర్వేరు నెట్‌వర్క్‌ల మధ్య మారుతున్నప్పుడు ఇంకా ఎక్కువ బ్యాటరీ వృథా అవుతుంది.

వైఫై సిగ్నల్‌లు మొబైల్ డేటా కంటే స్ట్రాంగ్ గా ఉంటాయి. ఫలితంగా, ఫోన్‌కి తక్కువ శక్తి అవసరం. అంటే, వై-ఫై వాడితే ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంట్లో లేదా ఆఫీసులో వైఫై నెట్‌వర్క్ ఉన్న చోట ఉంటే, మొబైల్ డేటాకు బదులు WiFiని వాడటం మంచిది. ఎందుకంటే వైఫై వాడితే మన ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉంటుంది. ఉదాహరణకు ఇంట్లో యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారనుకోండి. ఈ సమయంలో వైఫైని వాడితే, మీ ఫోన్ బ్యాటరీ 5 గంటలు ఉంటుంది. కానీ, మొబైల్ డేటా వాడితే బ్యాటరీ 3 గంటల్లో ఖాళీ అయిపోతుంది.

ముందుగా చెప్పుకున్నట్లు మనం మొబైల్ డేటా వాడేటప్పుడు, ఫోన్ ఎప్పుడూ నెట్‌వర్క్ సిగ్నల్‌ని వెతుకుతూ ఉంటుంది. ముఖ్యంగా సిగ్నల్ తక్కువగా ఉన్న చోట్ల ఇది ఎక్కువగా జరుగుతుంది. చాలా కష్టంగా సిగ్నల్ కోసం సెర్చ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. కానీ వైఫై సిగ్నల్ స్థిరంగా ఉంటుంది. అంటే, ఫోన్‌కి ఎప్పుడూ సిగ్నల్ వెతకవలసిన అవసరం ఉండదు. దీంతో ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉంటుంది.

WiFi మరో రెండు ప్రయోజనాలు చూస్తే మొబైల్ డేటా కంటే వైఫై వేగంగా, నమ్మదగినదిగా ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది ఉన్న చోట్ల మొబైల్ డేటా స్లోగా అవుతుంది. కానీ వైఫై స్థిరంగా ఉంటుంది. పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం, వీడియోలు చూడటం లేదా ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం లాంటివి చేసేటప్పుడు వైఫై వాడితే మొబైల్ డేటా సేవ్ అవుతుంది. మనీ పరంగా కూడా తక్కువ ఖర్చవుతుంది.

మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే, ఎప్పుడూ వైఫై ని వాడటానికి ప్రయత్నించండి. వైఫై దొరకని చోట్ల మాత్రమే మొబైల్ డేటా వాడండి. అంతేకాదు, సిగ్నల్ బలంగా ఉన్న చోట్ల ఉండాలి. అవసరం లేనప్పుడు మొబైల్ డేటా ఆఫ్ చేయాలి లేదా ఫోన్‌ని ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టవచ్చు. ఈ చిన్న చిన్న మార్పులతో మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు. ఫోన్ కూడా మరింత బాగా పని చేస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ట్రెండ్ మారింది.. మళ్ళీ పెర్ఫార్మన్స్ రోల్స్ తో స్టార్ హీరోస్ సరికొత్త ప్రయోగం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>