MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ninnu-choodalanic615bc0f-1da9-4aa0-b718-ed18e63d3986-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ninnu-choodalanic615bc0f-1da9-4aa0-b718-ed18e63d3986-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి సినిమా నిన్ను చూడాలని అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నువ్వు వస్తావని ఫేమ్ వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించగా లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఫ్యాన్స్ భారీ హిట్ అవుతుందని అనుకున్న ఈ సినిమా అంచనాలకు భిన్నమైన ఫలితాన్ని సొంతం చేసుకుంది. ninnu choodalani{#}prashanth neel;Prasanth Neel;AdiNarayanaReddy;Jr NTR;NTR;Love;Success;Cinema;Newsఎన్టీఆర్ ఫస్ట్ మూవీ నిన్నుచూడాలని కలెక్షన్లు అంత తక్కువా.. కోటి కూడా రాలేదా?ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ నిన్నుచూడాలని కలెక్షన్లు అంత తక్కువా.. కోటి కూడా రాలేదా?ninnu choodalani{#}prashanth neel;Prasanth Neel;AdiNarayanaReddy;Jr NTR;NTR;Love;Success;Cinema;NewsSun, 08 Dec 2024 11:10:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి సినిమా నిన్ను చూడాలని అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నువ్వు వస్తావని ఫేమ్ వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించగా లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఫ్యాన్స్ భారీ హిట్ అవుతుందని అనుకున్న ఈ సినిమా అంచనాలకు భిన్నమైన ఫలితాన్ని సొంతం చేసుకుంది.
 
అయితే హీరోగా ఎన్టీఆర్ కు ఈ మూవీ తొలి మూవీ అయినా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 80 లక్షల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఎన్టీఆర్ ఫస్ట్ మూవీకి కోటి రూపాయల కలెక్షన్లు కూడా రాలేదని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు తొలి సినిమా షాకిచ్చినా తర్వాత సినిమాలు భారీ హిట్లుగా నిలిచాయి.
 
స్టూడెంట్ నంబర్1, ఆది సినిమాల విజయాలతో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తారక్ సక్సెస్ రేట్ ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
 
తారక్ ప్రస్తుతం వార్2 సినిమాతో బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ ఎప్పటినుంచి మొదలవుతుందో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మీడియాకు దూరంగా ఉండటంతో చాలా ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో సైతం మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.













మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ట్రెండ్ మారింది.. మళ్ళీ పెర్ఫార్మన్స్ రోల్స్ తో స్టార్ హీరోస్ సరికొత్త ప్రయోగం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>