PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nitish-kumar1a6ff663-b293-4d5d-a7e8-fc950e0640da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nitish-kumar1a6ff663-b293-4d5d-a7e8-fc950e0640da-415x250-IndiaHerald.jpgమహారాష్ట్రలో బిజెపి ముఖ్యమంత్రిగా పడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కొత్త టెన్షన్ నెలకొంది. మహారాష్ట్ర ఫార్ములానే బీహార్ రాష్ట్రంలో కూడా అమలు చేస్తే... ఏక్ నాథ్ షిండేకు పట్టిన గతే నితీష్ కుమార్ కు పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బిజెపి కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. nitish kumar{#}2020;Shiv Sena;Elections;Nitish Kumar;Bihar;Assembly;Telangana Chief Minister;Maharashtra;Bharatiya Janata Partyఏక్ నాథ్ షిండే ఫార్ములా..నితీష్ కుమార్ పై మోడీ కొత్త కుట్రలు ?ఏక్ నాథ్ షిండే ఫార్ములా..నితీష్ కుమార్ పై మోడీ కొత్త కుట్రలు ?nitish kumar{#}2020;Shiv Sena;Elections;Nitish Kumar;Bihar;Assembly;Telangana Chief Minister;Maharashtra;Bharatiya Janata PartySun, 08 Dec 2024 08:54:00 GMTమహారాష్ట్రలో బిజెపి ముఖ్యమంత్రిగా పడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కొత్త టెన్షన్ నెలకొంది. మహారాష్ట్ర ఫార్ములానే బీహార్ రాష్ట్రంలో కూడా అమలు చేస్తే... ఏక్ నాథ్ షిండేకు పట్టిన గతే నితీష్ కుమార్ కు పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో బిజెపి కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది.


అయితే ఇందులో 120 కి పైగా బీజేపీకి స్థానాలు రావడం జరిగింది. 50 కి పైగా అసెంబ్లీ స్థానాలు ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీకి వచ్చాయి. అయితే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ తనకే ముఖ్యమంత్రి కావాలని ఏక్ నాథ్ షిండే డిమాండ్ చేయడం జరిగింది. కానీ పరిస్థితి ఎక్కడ వేరేలా మారిపోయింది. ఎక్కువ సీట్లు వచ్చినా బిజెపికి ముఖ్యమంత్రి పదవి దక్కింది. దీంతో ఏకనాథ్ షిండే కు ఘోర అవమానం ఎదురయిందని చెప్పవచ్చు.


అయితే మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే కు జరిగిన పరాభవమే... బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ కు కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లు... కొత్త చర్చ జరుగుతోంది. 2020 లో బీహార్ లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు బిజెపి అలాగే జేడీయు  కలిసి పోటీ చేసే అధికారంలోకి వచ్చాయి. అక్కడ బిజెపికి 80 సీట్లు వస్తే జేడియుకు 50 సీట్ల లోపు మాత్రమే వచ్చాయి. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బిజెపి అవతరించినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం నితీష్ కుమార్ అయ్యారు.


అప్పటి ప్రత్యేక పరిస్థితుల్లో నితీష్ కుమార్ ను బిజెపి ముఖ్యమంత్రి చేసింది. అయితే ఇప్పుడు 2025  మే మాసంలో మళ్ళీ బీహార్ లో ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో... మళ్లీ బిజెపి పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మహారాష్ట్ర ఫార్ములాను... బీహార్ లో కూడా బిజెపి అమలు చేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే నితీష్‌ కుమార్‌ పదవి పోవడం గ్యారెంటీ.  దీంతో నితీష్ కుమార్ వర్గం కొత్త టెన్షన్ కు లోన్ అవుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ నలుగురు సినిమాకు సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న లింక్ ఇదే ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>