MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-anasuya-special-songd08033c3-9d18-4655-935f-2d5f9b490474-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-anasuya-special-songd08033c3-9d18-4655-935f-2d5f9b490474-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అద్భుతమైన నటనతో మాస్ పెర్ఫార్మన్స్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇకపోతే కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయ జీవితంపై ఫోకస్ పెట్టిన ఈయన, పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, ఏకంగా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఒకవైపు రాజకీయ జీవితాన్ని అనుభవిస్తూనే మరొకవైపు అభిమానుల కోసం సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోని ఆయన సంతకం చేసిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్PAWAN KALYAN;ANASUYA;SPECIAL SONG{#}pithapuram;Master;m m keeravani;netizens;Deputy Chief Minister;Samantha;kalyan;Andhra Pradesh;sree;Pawan Kalyan;Mass;Heroine;India;Cinemaపవన్ కళ్యాణ్ తో అనసూయ స్పెషల్ సాంగ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!పవన్ కళ్యాణ్ తో అనసూయ స్పెషల్ సాంగ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!PAWAN KALYAN;ANASUYA;SPECIAL SONG{#}pithapuram;Master;m m keeravani;netizens;Deputy Chief Minister;Samantha;kalyan;Andhra Pradesh;sree;Pawan Kalyan;Mass;Heroine;India;CinemaSun, 08 Dec 2024 15:31:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అద్భుతమైన నటనతో మాస్ పెర్ఫార్మన్స్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇకపోతే కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయ జీవితంపై ఫోకస్ పెట్టిన ఈయన, పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, ఏకంగా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఒకవైపు రాజకీయ జీవితాన్ని అనుభవిస్తూనే మరొకవైపు అభిమానుల కోసం సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోని ఆయన సంతకం చేసిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ , OG వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ మధ్యకాలంలో ఐటమ్ సాంగ్స్ కి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసింది. ఇటీవల పాన్ ఇండియా మూవీ గా విడుదలైన పుష్ప సినిమాలో సమంత తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. అలాగే తాజాగా విడుదలైన పుష్ప 2 సినిమాలో శ్రీ లీలా కూడా ఐటమ్ సాంగ్ చేసి మెప్పించింది.


అయితే ఇప్పుడు వీరిద్దరినీ కాదని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం అనసూయను రంగంలోకి దింపినట్లు సమాచారం. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను గతంలోనే షూటింగ్ చేశారట. అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ ఎం ఎం కీరవాణి కంపోజ్ చేసిన ఒక మాస్ డాన్స్ నంబర్ దీనికోసమేనని ఇప్పుడు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కాస్త పెదవి విరుస్తున్నట్లు సమాచారం. పెద్దపెద్ద స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తుంటే.. ఒక యాంకర్ ను తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ చేయమంటే ఎలా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ట్రెండ్ మారింది.. మళ్ళీ పెర్ఫార్మన్స్ రోల్స్ తో స్టార్ హీరోస్ సరికొత్త ప్రయోగం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>