MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nagachaitanyacf03121d-990d-4ec2-a7f1-131a05b34359-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nagachaitanyacf03121d-990d-4ec2-a7f1-131a05b34359-415x250-IndiaHerald.jpgనాగచైతన్య-సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "తండేల్". ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరి 7, 2025వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారట. ఈ సినిమాను నిజ జీవిత ఆధారంగా రూపొందించారు. nagachaitanya{#}shobitha;Christmas;Bunny Vas;jeevitha rajaseskhar;Allu Aravind;Chaitanya;chandu;annapurna;December;Chitram;media;Hyderabad;Cinemaపెళ్ల‌యిన వారానికే నాగ‌చైత‌న్య గుడ్‌న్యూస్‌ ?పెళ్ల‌యిన వారానికే నాగ‌చైత‌న్య గుడ్‌న్యూస్‌ ?nagachaitanya{#}shobitha;Christmas;Bunny Vas;jeevitha rajaseskhar;Allu Aravind;Chaitanya;chandu;annapurna;December;Chitram;media;Hyderabad;CinemaSat, 07 Dec 2024 21:45:00 GMTనాగచైతన్య-సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "తండేల్". ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరి 7, 2025వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారట. ఈ సినిమాను నిజ జీవిత ఆధారంగా రూపొందించారు.


సముద్రంలో చేపల వేటకు వెళ్లిన కొందరు ఆంధ్ర మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. కాగా, ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల నుంచి ఆపేశారు. దానికి గల కారణం నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం. చైతు, శోభిత వివాహం డిసెంబర్ 4వ తేదీన జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ జంట వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు నాగార్జున. చైతు, శోభిత వివాహానికి సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు అందరూ విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు.

ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, తండేల్ మూవీ టీం అంతా కొద్దిరోజుల పాటు గ్యాప్ తీసుకుని తిరిగి ఈ సినిమా షూటింగ్ ఈనెల 11 నుంచి ప్రారంభం కానుంది. దీంతో చైతు సినిమా సెట్స్ పైకి రావడానికి రెడీ అవుతున్నాడు. కేవలం ఈ సినిమాకు సంబంధించి ఏడు రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది.



ప్రస్తుతం చైతు హైదరాబాద్ లోనే ఉన్నాడు. షూటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం చైతన్య తన సతీమణి శోభిత దూళిపాళ్లతో కలిసి హనీమూన్ వెళ్లాలని ప్లాన్ లో ఉన్నారట. తన సినిమా షెడ్యూల్ పూర్తయిన అనంతరం క్రిస్మస్ సెలవులు లేదా కొత్త సంవత్సరంలో హనీమూన్ కి వెళ్లాలని చైతు, శోభిత ప్లాన్ చేసుకుంటున్నారట. హనీమూన్ కోసం కొత్తజంట బయటి దేశాలకు వెళ్లాలని ఆలోచనలో ఉన్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ ను భయపెడుతున్న మెగా ఫ్యామిలీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>