MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayyafa81302c-6e1f-4388-ab47-ccd4a5e0e765-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayyafa81302c-6e1f-4388-ab47-ccd4a5e0e765-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు. కొంత కాలం క్రితం అఖండ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న బాలయ్య ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో కూడా విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే బాలయ్య తన తదుపరి మూవీ ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడు. కొంత కాలం క్రితం వీరి కాంబోలో రూపొందిన అఖండ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఆ సినిమాకి కొBalayya{#}Kesari;Sunny Deol;lion;Simha;boyapati srinu;Balakrishna;Hero;bollywood;Cinemaమరోసారి ఆ మాస్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య.. రంగంలోకి క్రేజీ బ్యానర్..?మరోసారి ఆ మాస్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య.. రంగంలోకి క్రేజీ బ్యానర్..?Balayya{#}Kesari;Sunny Deol;lion;Simha;boyapati srinu;Balakrishna;Hero;bollywood;CinemaSat, 07 Dec 2024 11:17:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు. కొంత కాలం క్రితం అఖండ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న బాలయ్య ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో కూడా విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే బాలయ్య తన తదుపరి మూవీ ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడు. కొంత కాలం క్రితం వీరి కాంబోలో రూపొందిన అఖండ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఆ సినిమాకి కొనసాగింపుగా అఖండ 2 అనే మూవీ ని రూపొందించబోతున్నారు.

మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఇకపోతే బాలయ్య కెరియర్ లో మంచి విజయం సాధించిన మూవీ లలో వీర సింహా రెడ్డి మూవీ ఒకటి. ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాలో బాలయ్య ను అద్భుతంగా చూపించడంతో ఈ దర్శకుడి పై బాలయ్య అభిమానులు మంచి ప్రశంసలు కురిపించారు. ఇకపోతే బాలయ్య మరోసారి ఈ దర్శకుడితో కలిసి పని చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితమే బాలయ్య కు గోపీచంద్ ఓ కథను వినిపించగా అది బాగా నచ్చడంతో బాలయ్య వెంటనే ఈ దర్శకుడితో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్ వారు ఈ మూవీ ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరో గా జాట్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోవిందుడు అందరివాడేలే: తొక్కిసలాటలో చరణ్ ఫ్యాన్ మృతి..భారీ సాయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>