MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-sai-pallavi-dance-rana-comments-viral5143cced-b1d7-4ed6-8f2a-693f5ff162fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-sai-pallavi-dance-rana-comments-viral5143cced-b1d7-4ed6-8f2a-693f5ff162fc-415x250-IndiaHerald.jpgనాగచైతన్య పేరు గత వారం రోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది.అందుకు కారణం శోభితతో వివాహమే.. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.. వివాహం అయిన వెంటనే శ్రీశైలం వెళ్లి అక్కడ దేవుడి దర్శనం చేసుకున్నారు ఈ కొత్త దంపతులు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.. చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తూ ఉన్నది.. నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లలో లవ్ స్టోNAGA CHAITANYA;SAI PALLAVI;DANCE;RANA;COMMENTS;VIRAL{#}Naga Chaitanya;annapurna;chandu;Amazon;Srisailam;Love Story;rana daggubati;Cinema;Sai Pallaviషాక్: ఏంటి నాగచైతన్య ఆ హీరోయిన్ కి భయపడతాడా..?షాక్: ఏంటి నాగచైతన్య ఆ హీరోయిన్ కి భయపడతాడా..?NAGA CHAITANYA;SAI PALLAVI;DANCE;RANA;COMMENTS;VIRAL{#}Naga Chaitanya;annapurna;chandu;Amazon;Srisailam;Love Story;rana daggubati;Cinema;Sai PallaviSat, 07 Dec 2024 18:52:00 GMTనాగచైతన్య పేరు గత వారం రోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది.అందుకు కారణం శోభితతో వివాహమే.. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.. వివాహం అయిన వెంటనే శ్రీశైలం వెళ్లి అక్కడ దేవుడి దర్శనం చేసుకున్నారు ఈ కొత్త దంపతులు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.. చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తూ ఉన్నది..


నాగచైతన్య, సాయి పల్లవి  కాంబినేషన్లలో లవ్ స్టోరీ సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకున్నది. ఇప్పుడు తండేల్ సినిమా పైన కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.. ముఖ్యంగా ఈమె డాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.హీరోయిన్ కాకముందు కూడా పలు రకాల డ్యాన్స్ షోలలో పాల్గొనేది..అందుకే డాన్స్ మూవ్మెంట్స్ విషయంలో ఎక్కడా కూడా సాయి పల్లవి రాజీపడదు చిన్న చిన్న స్టెప్పులను కూడా మిస్ కాకుండా చేస్తూ ఉంటుంది ఒకవేళ ఏదైనా సమస్య వస్తే కచ్చితంగా మళ్ళీ రీ షూట్ లాంటిది చేయిస్తుందట సాయి పల్లవి.


ఇప్పుడు అదే విషయాన్ని నాగచైతన్య తెలియజేస్తూ రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న అమెజాన్ టాక్ షోలో నాగచైతన్య పాల్గొని పలు విషయాలను తెలిపారు.. ఇందులో సాయి పల్లవి ప్రస్తావన తీసుకువస్తు నువ్వు(రానాను) సాయి పల్లవి తో సినిమా చేశావు కదా నీకు పాటలు లేకపోవడంతో బతికి పోయావు లేకపోతే ఆమెతో పాటలకు డాన్స్ వేయాలి అంటే చాలా టెన్షన్ గా భయంగా ఉంటుందని నవ్వుతో తెలియజేశారు.. ఆ వెంటనే సాయి పల్లవికి రానా ఫోన్ చేయడం జరిగింది వీరందరి మధ్య కొంత సరదా సంభాషణ జరిగింది.. అయితే సాయి పల్లవి మాత్రం నాగచైతన్య చాలా మొహమాటస్తుడు అంటూ వెల్లడించింది.. ఆయనకు ఏది నచ్చకపోయినా కూడా మౌనంగానే ఉంటారని తెలిపింది. సాయి పల్లవి మాత్రం ఎలాంటి విషయం అయినా సరే డైరెక్ట్ గానే చెప్పేస్తుందని తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ ను భయపెడుతున్న మెగా ఫ్యామిలీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>