MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-thummala-chandu9c2aaba2-77b1-4355-a711-42303a3172f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-thummala-chandu9c2aaba2-77b1-4355-a711-42303a3172f5-415x250-IndiaHerald.jpgమంత్రిగా లోకేష్ అధికారంలో ఉన్నారు అంటే కొన్ని వేల మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల క‌ష్టం.. త్యాగాలు.. ఆర్థిక న‌ష్టాలు చాలా ఉంటాయి. చంద్ర‌బాబు ప్ర‌తిసారి అధికారంలోకి వ‌చ్చాక కార్య‌క‌ర్త‌ల‌ను పూర్తిగా విస్మ‌రిస్తార‌న్న అప‌వాదులు ఎదుర్కొంటారు. పార్టీ 2019లో ఘోరంగా ఓడిపోవ‌డానికి కార్య‌క‌ర్త‌లు వ్య‌తిరేకంగా చేయ‌డ‌మే. లోకేష్ కొంత వ‌ర‌కు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటూ.. రెడ్‌బుక్ పెట్టి నేత‌ల్లో ఆత్మ‌స్థైర్యం నింపారు. తీరా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి.. లThummala Chandu{#}Lokesh;chandu;Krishna River;Perni Nani;Lokesh Kanagaraj;TDP;CBN;Nani;YCP;court;Hanu Raghavapudi;Minister;Party;police;June;Indiaబాబు గారు సీఎం అయిపోయారుగా.. ఇక ' తుమ్మ‌ల‌ చందు ' లాంటి కార్య‌క‌ర్త‌లు క‌నిపించ‌రు...!బాబు గారు సీఎం అయిపోయారుగా.. ఇక ' తుమ్మ‌ల‌ చందు ' లాంటి కార్య‌క‌ర్త‌లు క‌నిపించ‌రు...!Thummala Chandu{#}Lokesh;chandu;Krishna River;Perni Nani;Lokesh Kanagaraj;TDP;CBN;Nani;YCP;court;Hanu Raghavapudi;Minister;Party;police;June;IndiaSat, 07 Dec 2024 08:05:00 GMT- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )


వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ఎంతోమంది టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారు. ఈ రోజు టీడీపీ ఘ‌న‌విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చి సీఎంగా చంద్ర‌బాబు... మంత్రిగా లోకేష్ అధికారంలో ఉన్నారు అంటే కొన్ని వేల మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల క‌ష్టం.. త్యాగాలు.. ఆర్థిక న‌ష్టాలు చాలా ఉంటాయి. చంద్ర‌బాబు ప్ర‌తిసారి అధికారంలోకి వ‌చ్చాక కార్య‌క‌ర్త‌ల‌ను పూర్తిగా విస్మ‌రిస్తార‌న్న అప‌వాదులు ఎదుర్కొంటారు. పార్టీ 2019లో ఘోరంగా ఓడిపోవ‌డానికి కార్య‌క‌ర్త‌లు వ్య‌తిరేకంగా చేయ‌డ‌మే. లోకేష్ కొంత వ‌ర‌కు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటూ.. రెడ్‌బుక్ పెట్టి నేత‌ల్లో ఆత్మ‌స్థైర్యం నింపారు. తీరా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి.. లోకేష్ మంత్రి అయ్యారు. కాని పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పోరాటాలు చేసి.. కేసులు పెట్టించుకున్న నేత‌ల గోడు ప‌ట్టించుకోవ‌డం.. వాళ్లెవ్వ‌రు అధిష్టానానికి క‌న‌ప‌డ‌ట్లేదు.


వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కృష్ణా జిల్లాకు చెందిన తుమ్మ‌ల చందు అనే కార్య‌క‌ర్త పెట్టిన ఓ పోస్టుతో అత‌డు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆ కేసు అప్పుడు కేబినెట్లో కీ రోల్‌గా ఉన్న మాజీ మంత్రి పేర్ని నానిని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది. 2019 ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాజీ మంత్రి పేర్ని నాని తుమ్మ‌ల చందు ఓ ఇంట‌ర్వ్యూలో త‌న వ్యాఖ్య‌లు వ‌క్రీక‌రించి త‌న ప‌రువుకు భంగం క‌లిగించేలా చేశారంటూ అదే యేడాది ఏప్రిల్ 9న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌ర్వాత వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డడంతో మే 5న చిల‌క‌ల‌పూడి పోలీసులు విచార‌ణ చేసి ఇద్ద‌రిపై కేసు న‌మోదు చేయ‌గా... జూన్ 24న బంద‌రు కోర్టు ఇద్ద‌రికి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో నాని టార్గెట్ చేయ‌డంతో పార్టీ సాధార‌ణ కార్య‌క‌ర్త తుమ్మ‌ల చందు అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ప‌రిస్థితి.


సాధార‌ణంగా ఏ కేసులో అయినా ఫిర్యాదు దారుడు కోర్టు చుట్టూ తిరుగుతుంటే… ముద్దాయిలు త‌ప్పించుకుని తిరుగుతూ ఉంటారు. ఈ కేసులో మాత్రం సీన్ రివ‌ర్స్‌. మంత్రి ప‌దే ప‌దే బిజీ.. కోర్టుకు రావ‌డం కుద‌ర‌దు అన్న మాటే వినిపించేది. ముగ్గురు జ‌డ్జ్‌లు మారినా నాని మాత్రం కోర్టుకు డుమ్మా కొడుతూనే ఉన్నారు. చివ‌ర‌కు చందు త‌న‌పై ఫిర్యాదు చేసిన మంత్రి కోర్టుకు రావాల‌ని పోరాటం తీవ్ర‌త‌రం చేయ‌డంతో చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు యేడాది ముందు మాజీ మంత్రిగా ఉన్న నాని కేసులో రాజీ చేసుకోవాల‌ని చందుపై ఒత్తిడి తేవ‌డం ప్రారంభించారు. అయినా చందు పోరాటానికే మొగ్గు చూపారు.


ఈ కేసులో 2009 త‌ర్వాత కోర్టు మెట్లు ఎక్క‌ని పేర్ని నాని చాలా యేళ్ల త‌ర్వాత కోర్టు మెట్లు ఎక్కాల్సి రావ‌డంతో తీవ్ర అస‌హ‌నానికి కూడా గురైన‌ట్టు స‌మాచారం. ఇలా అప్ప‌ట్లో బ‌ల‌మైన నేత‌.. మంత్రిగా కూడా ఉన్న పేర్ని నానిపై ఎంతో పోరాటం చేసిన చందు.. త‌న‌కు పార్టీ పెద్ద‌ల నుంచి ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు లేక‌పోయినా పార్టీపై ఉన్న ప్రేమ‌తోనే ఇబ్బందులు ప‌డి పోరాటం చేశాన‌ని చెపుతూ ఉంటారు. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం ఉండ‌డంతో పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పోరాటాలు చేసి.. కేసులు పెట్టుకున్న కార్య‌క‌ర్త‌లు.. నాయ‌కుల‌కు బాబు గారు న్యాయం చేస్తారా ?  వీరికి తుమ్మ‌ల చందు లాంటి నాయ‌కులు ఎప్ప‌ట‌కి క‌నిపిస్తారు ? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్ కాబోయే భర్తకి ఆ స్టార్ హీరోయిన్ తో అలాంటి సంబంధం ఉందా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>