MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevif015ecaf-968e-4f4d-b201-724cbfc7c344-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevif015ecaf-968e-4f4d-b201-724cbfc7c344-415x250-IndiaHerald.jpgఈ సినిమాకి యునానిమస్ గా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అల్లు అర్జున్ మాసు జాతర .. అల్లు అర్జున్ రఫ్ఫా డించేశాడు అన్న టాక్‌ వస్తుంది. ముఖ్యంగా బన్నీ మాస్ యాక్షన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సుకుమార్ కథ ... కథనాల విషయంలో కొన్ని లోపాలు ఉన్న బన్నీ వన్ మ్యాన్ షో చేసి పడేసాడని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. అయితే గత కొన్ని యేళ్లుగా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మెగా అభిమానులు కాస్త ఎడమొకం .. పెడముఖంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. Chiranjeevi{#}Chiranjeevi;prem;ravi anchor;Vishakapatnam;Audience;Army;Cheque;Ishtam;Tollywood;India;Darsakudu;Director;sukumar;Allu Arjun;Cinemaచిరంజీవిని క‌లిసేందుకు కూడా బ‌న్నీకి ఇష్టం లేదా... పుష్ప 2 రిలీజ్ రోజు ఇంత జ‌రిగిందా..?చిరంజీవిని క‌లిసేందుకు కూడా బ‌న్నీకి ఇష్టం లేదా... పుష్ప 2 రిలీజ్ రోజు ఇంత జ‌రిగిందా..?Chiranjeevi{#}Chiranjeevi;prem;ravi anchor;Vishakapatnam;Audience;Army;Cheque;Ishtam;Tollywood;India;Darsakudu;Director;sukumar;Allu Arjun;CinemaFri, 06 Dec 2024 07:46:08 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

పుష్ప ది రూల్ సినిమా బుధవారం సెకండ్ షో నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ షో లతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అసలు కనీ విని ఎరుగ‌ని రేంజ్ లో పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి యునానిమస్ గా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అల్లు అర్జున్ మాసు జాతర .. అల్లు అర్జున్ రఫ్ఫా డించేశాడు అన్న టాక్‌ వస్తుంది. ముఖ్యంగా బన్నీ మాస్ యాక్షన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సుకుమార్ కథ ... కథనాల విషయంలో కొన్ని లోపాలు ఉన్న బన్నీ వన్ మ్యాన్ షో చేసి పడేసాడని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. అయితే గత కొన్ని యేళ్లుగా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మెగా అభిమానులు కాస్త ఎడమొకం .. పెడముఖంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.


కొన్నాళ్లుగా బన్నీతో పాటు ఆర్మీ ప్రవర్తిస్తున్న తీరు మెగా అభిమానులకు రుచించడం లేదు అన్నది వాస్తవం. ఇది ఇలా ఉంటే ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మెగా అభిమాన సంఘాలు పుష్ప 2 సినిమాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రభావం నిన్న సినిమా రిలీజ్ రోజు ప్రీమియర్ షోలపై స్పష్టంగా కనపడింది. ఇలాంటి సందర్భంలో పుష్ప 2 టీం తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసింది దర్శకుడు సుకుమార్ తో పాటు మైత్రి నిర్మాతలు ఎర్నేని నవీన్ - రవి ఎలమంచిలి - సీఈవో చెర్రీ చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు.


ఈ ఫోటోలను మీడియాకి విడుదల చేశారు .. అంతా బాగుంది కానీ ఈ టీంలో మెయిన్ క్యారెక్టర్ పుష్పరాజు మిస్ అయ్యాడు. నిజానికి ఆ టీం తో పాటు బన్నీ కూడా వెళ్లి మెగా ఆశీస్సులు తీసుకుని ఉంటే బాగుండేది.. పుకారులకు చెక్ పెట్టినట్టు అయ్యేది. ఆ ప్రేమ్ లో అల్లు అర్జున్ మిస్ అవ్వటం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మెగా అభిమానులు అయితే చిరంజీవిని కలిసేందుకు బన్నీకి ఇష్టం లేదని ... అందుకే పుష్ప దర్శకుడు సుకుమార్ తో పాటు నిర్మాతలు అందరూ వెళ్లిన బన్నీ వెళ్లలేదని విమర్శలు చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 : బ్లాక్ బస్టర్.. మళ్లీ లైన్లోకి వచ్చిన క్రేజీ డైరెక్టర్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>