Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/-rohit-sharma26a881ef-319c-4038-8eb3-48bc3c1f4894-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/-rohit-sharma26a881ef-319c-4038-8eb3-48bc3c1f4894-415x250-IndiaHerald.jpgటీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఇటీవల కాన్బెర్రాలో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టుతో ఓ మ్యాచ్‌ ఆడారు. ఈ సమయంలో మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేయడం గురించి రోహిత్ శర్మను ప్రశ్నించగా, ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే, ఆయన సమాధానం చాలా సింపుల్ గా ఉంది. “పింక్ బాల్‌తో ఎలా బ్యాటింగ్ చేయాలనేది తెలుసుకోవడానికే మేము ఇలా చేశాము” అని అడిలైడ్ ఓవల్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన చెప్పారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు జరిగే అడిలైడ్ టెస్ట్‌లో ఓపెనింగ్ చేయనని తెలుపుతూనే, ఆ స్థానం భవిష్యత్తులో కRohit Sharma{#}Kumaar;Rohit Sharma;Yuva;Adelaide;Yashasvi Jaiswal;rahul;Rahul Sipligunj;Prime Minister;Kollu Ravindra;Press;Yevaruఇక నేను ఓపెనింగ్ చేయకపోవచ్చు.. రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్?ఇక నేను ఓపెనింగ్ చేయకపోవచ్చు.. రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్?Rohit Sharma{#}Kumaar;Rohit Sharma;Yuva;Adelaide;Yashasvi Jaiswal;rahul;Rahul Sipligunj;Prime Minister;Kollu Ravindra;Press;YevaruFri, 06 Dec 2024 11:00:00 GMTటీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఇటీవల కాన్బెర్రాలో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టుతో ఓ మ్యాచ్‌ ఆడారు. ఈ సమయంలో మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేయడం గురించి రోహిత్ శర్మను ప్రశ్నించగా, ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే, ఆయన సమాధానం చాలా సింపుల్ గా ఉంది. “పింక్ బాల్‌తో ఎలా బ్యాటింగ్ చేయాలనేది తెలుసుకోవడానికే మేము ఇలా చేశాము” అని అడిలైడ్ ఓవల్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన చెప్పారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు జరిగే అడిలైడ్ టెస్ట్‌లో ఓపెనింగ్ చేయనని తెలుపుతూనే, ఆ స్థానం భవిష్యత్తులో కూడా తప్పుకునే అవకాశం ఉన్నట్టు మాట్లాడాడు.

అనంతరం, రెండో టెస్ట్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారనే ప్రశ్నకు సమాధానమిస్తూ, “కె.ఎల్. రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు, నేను మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేస్తాను.” అని రోహిత్ స్పష్టంగా చెప్పారు. "బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడానికి నేను తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాలంటే, రాహుల్, యశస్వి జైస్వాల్ చాలా బాగా ఆడారు. నేను నాకు బిడ్డ పుట్టినప్పుడు ఇంట్లోనే కొన్ని రోజులు గడిపాను ఆ సమయంలో రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ చూశాను. అప్పుడు నాకు ఓపెనింగ్ జోడిని మార్చకూడదని అనిపించింది. కానీ, వ్యక్తిగతంగా నేను ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమే. అయితే, జట్టు కోసం చూస్తే ఈ నిర్ణయమే సరైనది" అని రోహిత్ చెప్పారు.

పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజాలను జట్టులో ఎందుకు చేర్చలేదనే ప్రశ్నకు సమాధానమిస్తూ, "ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఈ ఇద్దరూ మనకు చాలా మ్యాచ్‌లు గెలిపించారు. ప్రతి మ్యాచ్‌కు అనుగుణంగా పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేయడమే మన లక్ష్యం, అదే మేం ఈ సిరీస్‌లో చేయబోతున్నాం" అని రోహిత్ చెప్పారు.

"మేము ఇక్కడ చాలా మ్యాచ్‌లు చూశాము, ఇక్కడ ఏం ఆశించాలనేది మాకు బాగా తెలుసు" అని రోహిత్ పరిస్థితుల గురించి చెప్పారు. జైస్వాల్, హర్షిత్ రాణా, నితిష్ కుమార్ వంటి యువ ఆటగాళ్లను రోహిత్ ప్రశంసించారు. "ఈ కొత్త తరం ఆటగాళ్లకు భయం ఏమీ ఉండదు. వారు గెలవాలనే కోరికతోనే ఉంటారు" అని రోహిత్ చెప్పారు. వాషింగ్టన్ సుందర్‌కు గాయాలు లేకుండా ఆరోగ్యంగా ఉండి, తన కెరీర్‌ను మెరుగుపరుచుకోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు.. ఈ సినిమాలకు కోట్లల్లో నష్టం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>