PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/viajaya-sai-reddy9b82c1c3-6d9f-4b9d-9274-bff070fc538e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/viajaya-sai-reddy9b82c1c3-6d9f-4b9d-9274-bff070fc538e-415x250-IndiaHerald.jpgవైసీపీ కీలక నేత ఎంపీ వి విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. ఆయన మీద పరువు నష్టం దావా వేస్తాను అని కూడా హెచ్చరించారు. దానికి కారణం తన మీద లుక్ ఔట్ నోటీసులు ఇచ్చినందుకు అని ఆయన ఫైర్ అయ్యారు. పాలన చేతకాక ఇలాంటివి చేస్తున్నారు అని అంటున్నారు. కాకినాడ పోర్టులో అక్రమాలు జరిగాయని అంటున్నారని తనను మధ్యలోకి తెచ్చి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడమేంటి అని ఆయన ప్రశ్నించారు. నిజంగా అక్కడ అవినీతి అక్రమాలు బయటపడాలి అంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబviajaya sai reddy{#}kalyan;CBI;kakinada;MP;Leader;Jagan;CBN;Government;Janasena;TDPపవనే బెస్ట్ అంటున్న విజయ సాయి రెడ్డి..? మతలబు ఏంటో..!పవనే బెస్ట్ అంటున్న విజయ సాయి రెడ్డి..? మతలబు ఏంటో..!viajaya sai reddy{#}kalyan;CBI;kakinada;MP;Leader;Jagan;CBN;Government;Janasena;TDPFri, 06 Dec 2024 11:33:00 GMTవైసీపీ కీలక నేత ఎంపీ వి విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు.  ఆయన మీద పరువు నష్టం దావా వేస్తాను అని కూడా హెచ్చరించారు.  దానికి కారణం తన మీద లుక్ ఔట్ నోటీసులు ఇచ్చినందుకు అని ఆయన ఫైర్ అయ్యారు.  పాలన చేతకాక ఇలాంటివి చేస్తున్నారు అని అంటున్నారు.


కాకినాడ పోర్టులో అక్రమాలు జరిగాయని అంటున్నారని తనను మధ్యలోకి తెచ్చి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడమేంటి అని ఆయన ప్రశ్నించారు. నిజంగా అక్కడ అవినీతి అక్రమాలు బయటపడాలి అంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు లోకేష్ ల మీద విరుచుకుపడుతూనే అదే సమయంలో పవన్ కళ్యాణ్ ని మెచ్చుకునెలా మాట్లాడారు. ఏపీలో పాలన చేయాలీ అంటే చంద్రబాబు లోకేష్ ల కంటే కూడా పవన్ బెస్ట్ లీడర్ అవుతారు అని కితాబు ఇచ్చారు.


మరి పవన్ ని సడెన్ గా విజయసాయిరెడ్డి ఎందుకు పొగిడారు అన్నదే చర్చనీయాశంగా ఉంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన తాను పవన్ ని విమర్శించకపోవడానికి కారణం ఆయన తనకు మిత్రుడు అని చెప్పారు. ఇపుడు చూస్తే పవన్ బెస్ట్ అంటున్నారు. దాంతోనే ఇది ఒక వైరల్ గా మారుతోంది. ఏపీలో చూస్తే టీడీపీ కూటమిలో జనసేన ఉంది. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా బియ్యం పంపిణీ జరుగుతోంది అన్నది కూడా పవన్ లేవనెత్తిన ఇష్యూనే. ఆయనే స్వయంగా సముద్రంలోకి వెళ్ళి మరీ అక్కడ షిప్ ని తనిఖీ చేసారు.


మరి పవన్ ఆ విధంగా ఈ విషయంలో సీరియస్ యాక్షన్ కోరుకున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా దాని మీద ఫోకస్ పెట్టింది. ఇపుడు విజయసాయిరెడ్డి పవన్ బెస్ట్ అంటూ చంద్రబాబు మీద విమర్శలతో ఆడిపోసుకోవడం వెనక ఏ వ్యూహముందని అంటున్నారు.


కొస మెరుపుగా తమ అధినేత జగన్ ఇంకా మంచి పాలన ఇస్తారని కూడా విజయసాయిరెడ్డి అన్న మాటనూ గుర్తు చేసుకుంటున్నారు.  సో ఆయన అన్న మాటలలో బాబు టీడీపీనే గట్టిగా టార్గెట్ చేశారని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి నోటి వెంట పవన్ బెస్ట్ అన్న మాట రావడం మాత్రం రాజకీయంగా కొంత సంచలనంగానే ఉంది అని అంటున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా కుటుంబం చేసిన తప్పు అల్లు అర్జున్ రేంజ్ పెంచిందా.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>