MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pusha-2aac8d55d-7866-4bc8-9936-c990f581e1fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pusha-2aac8d55d-7866-4bc8-9936-c990f581e1fa-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అందరూ వెయిట్ చేస్తున్న ఈ సినిమా... తాజాగా రిలీజ్ కావడం జరిగింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటల ప్రాంతంలోనే ప్రీ షో లు విడుదలయ్యాయి. దీంతో ఫ్యాన్స్ అందరు ఎగబడి ఈ సినిమా చూసేందుకు వచ్చారు. పుష్ప మొదటి భాగం కంటే రెండవ భాగం అద్భుతంగా ఉంటుందని.. భావించిన అభిమానులు... టికెట్లు ముందే బుక్ చేసుకొని రచ్చ చేశారు. pusha 2{#}fazil;Jr NTR;rao ramesh;Kannada;Comedy;kusuma jagadish;Raccha;Darsakudu;rashmika mandanna;anasuya bharadwaj;sunil;Anasuya;Director;Arjun;Allu Arjun;sukumar;Cinema;Decemberపుష్ప 2.. ఆ పాత్ర‌ను ప‌ర‌మ‌ వీపీని చేశారుగా... ఆ విష‌యంలో సుక్కు దెబ్బేశాడు...!పుష్ప 2.. ఆ పాత్ర‌ను ప‌ర‌మ‌ వీపీని చేశారుగా... ఆ విష‌యంలో సుక్కు దెబ్బేశాడు...!pusha 2{#}fazil;Jr NTR;rao ramesh;Kannada;Comedy;kusuma jagadish;Raccha;Darsakudu;rashmika mandanna;anasuya bharadwaj;sunil;Anasuya;Director;Arjun;Allu Arjun;sukumar;Cinema;DecemberThu, 05 Dec 2024 07:10:00 GMTఅల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అందరూ వెయిట్ చేస్తున్న ఈ సినిమా... తాజాగా రిలీజ్ కావడం జరిగింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9:30 గంటల ప్రాంతంలోనే ప్రీ షో లు విడుదలయ్యాయి. దీంతో ఫ్యాన్స్ అందరు ఎగబడి ఈ సినిమా చూసేందుకు వచ్చారు. పుష్ప మొదటి భాగం కంటే రెండవ భాగం అద్భుతంగా ఉంటుందని.. భావించిన అభిమానులు... టికెట్లు ముందే బుక్ చేసుకొని రచ్చ చేశారు.

 ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప రెండవ పార్టు... ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంచనాలకు మించి ఈ సినిమా ఉన్నట్లు చెబుతున్నారు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు వరల్డ్ ఫైర్ అన్న రేంజ్ లోనే సినిమా ఉందట. అయితే ఈ సినిమాలో.. అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందాన అద్భుతంగా నటించినట్లు చెబుతున్నారు సినిమా చూసిన వాళ్ళు. ఈ ఇద్దరి కారణంగానే సినిమా ఎక్కడికో వెళ్లిపోయిందని కూడా అంటున్నారు..

 అయితే దర్శకత్వంలో సుకుమార్ కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల...  సినిమాకు పెద్ద బొక్క పడిందని కూడా కొంతమంది చెబుతున్నారు. అందులో ముఖ్యంగా విలనిజం  ప్రభావం ఎక్కువగా ఉండకపోవడం. ఈ సినిమాలో ఫహద్ ఫజిల్  షేకావత్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.  అయితే అతని పాత్ర పెద్దగా ఈ సినిమాలో పీలలేదని ఫ్యాన్స్ అంటున్నారు. అతను ముందుగా సీరియస్ గా కనిపించి ఆ తర్వాత... కామెడీ విలన్ గా మారిపోతాడట.

 అంతేకాదు ఫహద్ పాత్ర ముగింపు కూడా... లాజిక్ లేకుండా అయిపోతుందట. అతని ఎందుకు పెట్టారో అర్థం కాని పరిస్థితి నెలకొంటుందట. ఇక రావు రమేష్ తప్ప సునీల్ అలాగే అనసూయ పాత్రలకు... పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదా దర్శకుడు సుకుమార్. ఇక జగపతిబాబు అటు కన్నడ నటుడు తారక్ పొన్నప్ప  ఇద్దరూ అందరినీ ఆకట్టుకుంటారట. అల్లు అర్జున్ ఫ్రెండ్ గా జగదీష్ పాత్ర చాలా  అద్భుతంగా ఉంటుంది. అయితే పుష్ప మొదటి భాగంలో కేశవ పాత్ర ప్రభావం ఉన్నంతగా రెండవ పార్ట్ లో కనిపించలేదని అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప2 ఫైరా? ఫ్లవరా? బెనిఫిట్ షో టాక్ తో తేలిపోయిందిగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>