Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunnyeeda8fc6-a34f-4279-80af-77123092268f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunnyeeda8fc6-a34f-4279-80af-77123092268f-415x250-IndiaHerald.jpgసాదరణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి రేమ్యునరేషన్ ఎంత.. ఇక వారు ఎంతలా ఆస్తులను కూడా బెట్టుకున్నారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కేవలం టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరుగా కొనసాగుతున్నారు అల్లు అర్జున్. పుష్ప-2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఏకంగా అల్లు అర్జున్ 150 నుంచి 200 కోట్ల పారితోషకం తీసుకున్నాడు అంటూ వార్తలు కbunny{#}Tamil;Geetha Arts;Asian Cnemas;Hyderabad;Wanted;House;media;Success;INTERNATIONAL;Arjun;News;Tollywood;Indian;Hero;Allu Arjunఒక్క పుష్ప-2 కే సినిమాకే రూ.150 కోట్లు.. అసలు అల్లు అర్జున్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?ఒక్క పుష్ప-2 కే సినిమాకే రూ.150 కోట్లు.. అసలు అల్లు అర్జున్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?bunny{#}Tamil;Geetha Arts;Asian Cnemas;Hyderabad;Wanted;House;media;Success;INTERNATIONAL;Arjun;News;Tollywood;Indian;Hero;Allu ArjunThu, 05 Dec 2024 09:15:00 GMTసాదరణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి రేమ్యునరేషన్ ఎంత.. ఇక వారు ఎంతలా ఆస్తులను కూడా బెట్టుకున్నారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు అందరూ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. కేవలం టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరుగా కొనసాగుతున్నారు అల్లు అర్జున్.  పుష్ప-2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఏకంగా అల్లు అర్జున్ 150 నుంచి 200 కోట్ల పారితోషకం  తీసుకున్నాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఒక్క సినిమాకి 200 కోట్ల పారితోషకం తీసుకుంటే అసలు అల్లు అర్జున్ ఆస్తుల విలువ ఎంత అన్న విషయం తెలుసుకునేందుకు కూడా అభిమానులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ వివరాలు చూసుకుంటే..

ఇలా సినిమాల ద్వారానే కాదు ఇతర రంగాలలో కూడా అల్లు అర్జున్  ఆయన చాలానే సంపాదించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.460 కోట్ల నికర విలువ ఉన్నట్లు తెలుస్తోంది.  సినిమాల నుంచే కాకుండా.. వివిధ నిర్మాణాలు, వివిధ రంగాలలో బాగానే సంపాదిస్తున్నాడట అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఒక ప్రైవేట్ జెట్ ఉంది అన్న విషయం తెలిసిందే.

అల్లు స్టూడియో: ఎ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్

2022లో, అల్లు అర్జున్ హైదరాబాద్లో తన సొంత ప్రొడక్షన్ హౌస్ అల్లు స్టూడియోని ప్రారంభించడం ద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి సిద్ధమయ్యాడు అల్లు అర్జున్. 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో కూడిన స్టూడియోని నిర్మించారు. వీరికి అల్లు స్టూడియోతో పాటు ప్రముఖ చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా ఉంది అన్న విషయం తెలిసిందే.

మల్టీప్లెక్స్ వ్యాపార విస్తరణ

జూన్ 2023లో అల్లు అర్జున్ హైదరాబాద్లోని అమీర్పేట్లో తన సొంత మల్టీప్లెక్స్ను ప్రారంభించారు. ఏషియన్ సినిమాస్ తో కలిసి ఈ మల్టీప్లెక్స్ ని స్టార్ట్ చేశాడు. ఇలాంటిదే మరొకటి ప్రారంభించాలని చూస్తున్నాడు.

ది రెస్టారెంట్: బఫెలో వైల్డ్ వింగ్స్ ఫ్రాంచైజ్

 రెస్టారెంట్లపై పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అల్లు అర్జున్ కూడా ఇదే చేశారట. అల్లు అర్జున్కు విజయవంతమైన రెస్టారెంట్లు ఉన్నాయి. హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్, రెస్టారెంట్ చైన్ బఫెలో వైల్డ్ వింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

బ్రాండ్ ఎండార్స్మెంట్లు అండ్ సోషల్ మీడియా ప్రభావం

ఇన్స్టాగ్రామ్లో 25 మిలియన్లకు పైగా సోషల్ మీడియా ఫాలోయింగ్తో అల్లు అర్జున్ బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం మోస్ట్ వాంటెడ్ గా  మారారు. బన్నీ ఒక్క బ్రాండ్ ప్రమోషన్ కి  సుమారుగా రూ. 4 కోట్లు వసూలు చేస్తాడు. అంతేకాకుండా అతిపెద్ద దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో అనుబంధం కలిగి ఉన్న అల్లు అర్జున్ ఇప్పటికే  KFC, Frooti, Rapido, hero MotoCorp, RedBus, Hotstar వంటి కంపెనీలతో భాగస్వామిగా ఉన్నాడు.

ఆహా: అల్లు అర్జున్ OTT ప్రయత్నం

నవంబర్ 2020లో అల్లు అర్జున్ తెలుగు, తమిళ కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన ఆహాకు బ్రాండ్ అంబాసిడర్ కూడా మారిపోయారు.

హెల్త్కేర్లో పెట్టుబడి: కాల్హెల్త్ సర్వీసెస్

అల్లు అర్జున్ ఆన్లైన్ మెడికల్ కన్సల్టేషన్లు, నర్సింగ్ కేర్, డయాగ్నస్టిక్ టెస్ట్లు, మెడిసిన్ డెలివరీ, ఇతర ఆరోగ్య సేవలను అందించే హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ అయిన కాల్హెల్త్ సర్వీసెస్లో పెట్టుబడితో హెల్త్కేర్ రంగంలో కూడా సక్సెస్ అవుతున్నాడు .

ఇలా మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్ నికర విలువ రూ. 960 కోట్లు అని తెలుస్తోంది. .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2: పుష్ప గాడి పాన్ ఇండియా జాత‌ర‌... బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల జాత‌రే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>