EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/vizage6c716bf-d998-4fb8-b39d-7c9993798532-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/vizage6c716bf-d998-4fb8-b39d-7c9993798532-415x250-IndiaHerald.jpgవిశాఖ మీద టీడీపీ కూటమి ప్రభుత్వం ఫుల్ గా ఫోకస్ పెడుతోంది. విశాఖను మెగా సిటీగా చెప్పుకోవాలి. రవాణా మార్గాలు, జల వాయు రోడ్డు రైల్ కనెక్టివిటీ ఉంది. విశాఖ టూరిస్ట్ స్పాట్ గా మొదటి నుంచి ఉంది. రెండు దశాబ్దాలుగా ఐటీ సెక్టార్ కూడా విస్తరిస్తోంది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ తరువాత విశాఖ ఐటీ కి రెండవ రాజధాని అని చెప్పేవారు. రాష్ట్రం విడిపోయిన తరువాత విశాఖ చుట్టూ సాఫ్ట్ వేర్ ఫీల్డ్ తిరుగుతోంది. ఐటీ ఇండస్ట్రీని మరింతగా మెగా సిటీస్ లో విస్తరించాలీ అంటే విసాఖను మించినది లేదని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు.vizag{#}Industries;Vishakapatnam;Aqua;TDP;software;Rail;Hyderabad;Capital;Success;Population;Governmentకూటమి పాలనతో వైజాగ్ దశ మారనుందా?కూటమి పాలనతో వైజాగ్ దశ మారనుందా?vizag{#}Industries;Vishakapatnam;Aqua;TDP;software;Rail;Hyderabad;Capital;Success;Population;GovernmentThu, 05 Dec 2024 09:02:00 GMTవిశాఖ మీద టీడీపీ కూటమి ప్రభుత్వం ఫుల్ గా ఫోకస్ పెడుతోంది.  విశాఖను మెగా సిటీగా చెప్పుకోవాలి. రవాణా మార్గాలు, జల వాయు రోడ్డు రైల్ కనెక్టివిటీ ఉంది.   విశాఖ టూరిస్ట్ స్పాట్ గా మొదటి నుంచి ఉంది.  రెండు దశాబ్దాలుగా ఐటీ సెక్టార్ కూడా విస్తరిస్తోంది.  ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ తరువాత విశాఖ ఐటీ కి రెండవ రాజధాని అని చెప్పేవారు. రాష్ట్రం విడిపోయిన తరువాత విశాఖ చుట్టూ సాఫ్ట్ వేర్ ఫీల్డ్ తిరుగుతోంది.


ఐటీ ఇండస్ట్రీని మరింతగా మెగా సిటీస్ లో విస్తరించాలీ అంటే విసాఖను మించినది లేదని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. దాంతో ఆ దిశగా పరిశ్రమలు వస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, అదానీ సెంటర్ వంటివి విశాఖకు రావడానికి కూడా కారణాలు మెగా సిటీ కాస్మో పాలిటిన్స్ సిటీ కల్చర్ కావడమే.



విశాఖకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి ఆమోదం లభించడంతో విశాఖ దశ తిరుగుతోంది అని అంటున్నారు.  ఈ క్రమంలో విశాఖపట్నంలోనూ వివిధ దశల్లో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని తీర్మానించారు విశాఖలో ఈ రోజుకు పాతిక లక్షల మంది జనాభా ఉన్నారు. ఇది అంతకంతకు పెరుగుతోంది.  విశాఖ శివారు ప్రాంతాలు కూడా ఇపుడు సిటీలో కలసిపోయాయి. దాంతో విశాఖకు ఉన్న జనాభా సైతం మెట్రో రైలు ప్రాజెక్ట్ సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నారు.


విశాఖను అల్లుకుని అనేకమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.  ఐటీ రంగం కూడా వేళ్ళూనుకుంటున్న నేపథ్యం ఉంది. ఇక రియల్ ఎస్టేట్ తో పాటు అనేక రకాలైన వ్యాపారాలకు కూడా విశాఖ కీలకంగా ఉంది. ఈ మొత్తం చూస్తే కనుక విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ కనుక పట్టాలు ఎక్కితే దశ పూర్తిగా మారుతుందని అంటున్నారు.  


విశాఖపట్నంలో మూడు కారిడార్లలో మెట్రోరైలు ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని తెలుస్తోంది. ఈ క్రమంలో దశాబ్దాలుగా వెంటాడుతున్న ట్రాఫిక్ సమస్యల నుంచి విశాఖ వాసులకు ముక్తి లభిస్తుందని అంటున్నారు.  విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొత్తం 76.9 కిలోమీటర్ల మేర చేపడతారు.అది కూడా తొలి దశలో అని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖకు అద్భుతమైన అవకాశంగా దీనిని చూస్తున్నారు. రానున్న రోజులలో విశాఖ దశ తిరగడం ఖాయమని అంటున్నారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2: పుష్ప గాడి పాన్ ఇండియా జాత‌ర‌... బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల జాత‌రే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>