BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chaina6581d753-f4f9-433d-a6e8-c6829db6af30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chaina6581d753-f4f9-433d-a6e8-c6829db6af30-415x250-IndiaHerald.jpgప్రపంచానిదంతా ఒకదారైతే చైనాది మరో దారి.. అందరూ ఒకలా ఆలోచిస్తే డ్రాగన్ దానిని తలదన్నేలా ఆలోచిస్తుంది.. అవసరమైతే ఆర్టిఫిషియల్ సూర్యుడిని కూడా తయారు చేస్తుంది..ఇంకా ముందుకెళ్తే చంద్రుడినీ రూపొందిస్తుంది. అలాంటి చైనా యుద్ధ రంగంలోకి కొత్త ప్రయోగాలకు మాత్రం ఎందుకు దూరంగా ఉంటుంది. తాజాగా అదే చేసింది. స్టార్ వార్స్ సిరీస్.. హాలీవుడ్ లో అత్యంత ఆదరణ పొందిన సినిమాలు. ఇందులో ఒకటి డెత్ స్టార్ ఆఫ్ ది స్టార్ వార్స్. ఇప్పుడీ సినిమా స్ఫూర్తితోనే చైనా అత్యంత ప్రమాదకర ఆయుధం రూపొందించిందట. దీనికి వారు పెట్టిన పేరchaina{#}Hollywood;vehicles;Cinemaచైనా మాములుది కాదు..? ఏకంగా గ్రహాన్నే నాశనం చేసేలా పరిశోధనలు?చైనా మాములుది కాదు..? ఏకంగా గ్రహాన్నే నాశనం చేసేలా పరిశోధనలు?chaina{#}Hollywood;vehicles;CinemaThu, 05 Dec 2024 09:05:00 GMTప్రపంచానిదంతా ఒకదారైతే చైనాది మరో దారి.. అందరూ ఒకలా ఆలోచిస్తే డ్రాగన్ దానిని తలదన్నేలా ఆలోచిస్తుంది.. అవసరమైతే ఆర్టిఫిషియల్ సూర్యుడిని కూడా తయారు చేస్తుంది..ఇంకా ముందుకెళ్తే చంద్రుడినీ రూపొందిస్తుంది. అలాంటి చైనా యుద్ధ రంగంలోకి కొత్త ప్రయోగాలకు మాత్రం ఎందుకు దూరంగా ఉంటుంది. తాజాగా అదే చేసింది.


స్టార్ వార్స్ సిరీస్.. హాలీవుడ్ లో అత్యంత ఆదరణ పొందిన సినిమాలు. ఇందులో ఒకటి డెత్ స్టార్ ఆఫ్ ది స్టార్ వార్స్. ఇప్పుడీ సినిమా స్ఫూర్తితోనే చైనా అత్యంత ప్రమాదకర ఆయుధం రూపొందించిందట. దీనికి వారు పెట్టిన పేరు 'బీమ్ వెపన్'. అయితే, స్టార్ వార్స్ సినిమాలు చూసినవారికే 'బీమ్ వెపన్' అంటే ఏమిటో తెలుస్తుంది.


ఆయుధాల్లో అత్యంత శక్తిమంతమైనవి లేజర్. స్టార్ వార్స్ సినిమాల్లో 8 వేర్వేరు లేజర్ కిరణాల కలయికతో ఒక తీవ్రమైన కాంతిపుంజం ఏర్పడుతుంది. దీన్ని శత్రువుపై దాడికి వినియోగిస్తారు. ఇది ఎంత శక్తిమంతం అంటే.. ఏకంగా ఒక గ్రహాన్నే నాశనం చేస్తుంది. ఇప్పుడు చైనా తయారు చేసిన బీమ్ ఇలాంటిదేనట.


యుద్ధాల్లో వేగం.. కచ్చితత్వం.. చాలా ముఖ్యమైనవి. లేజర్‌ ఆయుధమైన బీమ్ అధునాతన సాంకేతిక ఆయుధం. అధిక కచ్చితత్వం, మైక్రోవేవ్ ట్రాన్స్‌మిటింగ్ వాహనాలను కనెక్ట్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్‌ వాడుతున్నారు. ఇది విడుదల చేసే శక్తిమంతమైన కాంతిపుంజం లక్ష్యాన్ని అ‍త్యంత వేగంగా ధ్వంసం చేస్తుంది. ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది. కాగా, బీమ్ వినియోగానికి 7 వాహనాలు అవసరం అవుతాయి. ఇది భారీగా ఉంటూ, అధిక స్థలాన్ని ఆక్రమించడమే దీనికి కారణం. లక్ష్యాన్ని ఛేదించడంలో ఇప్పటివరకూ ఈ స్థాయి ఆయుధం రాలేదంటేనే బీమ్ సత్తా ఏమిటో తెలిసిపోతుంది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమెరికా నుండి అనకాపల్లి వరకు నీ యువ్వ తగ్గేదేలే..! అంటున్న ఫ్యాన్స్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>