EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawana519ba19-03c8-4e36-ba7d-0a4651bc70bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawana519ba19-03c8-4e36-ba7d-0a4651bc70bb-415x250-IndiaHerald.jpgడిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గర మొత్తం ఐదు శాఖలున్నాయి. పట్టుబట్టి మరీ పౌరసరఫరాలశాఖను తీసుకున్నారు. దీనిని తన స్నేహితుడు నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు. వెంటనే పౌరసరఫరాలశాఖలో అసలు ఏం జరుగుతోంది? ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది? అనే విషయాలను తెలుసుకోవడంపై ఆయన దృష్టిసారించారు. మొత్తం ఒక స్పష్టత వచ్చిన తర్వాత కాకినాడలో విస్త్రత తనిఖీలు చేపట్టారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ ఒకటికి రెండుసార్లు కాకినాడ పర్యటించి వెళ్లారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్యpawan{#}Nadendla Manohar;West Godavari;Prathipadu;Thota Chandrasekhar;MLA;Janasena;Pawan Kalyan;kakinada;Government;CMపవన్ పగబడితే ఇలా ఉంటుందా? ద్వారంపూడి కి చుక్కలు చూపిస్తున్నారు గా?పవన్ పగబడితే ఇలా ఉంటుందా? ద్వారంపూడి కి చుక్కలు చూపిస్తున్నారు గా?pawan{#}Nadendla Manohar;West Godavari;Prathipadu;Thota Chandrasekhar;MLA;Janasena;Pawan Kalyan;kakinada;Government;CMWed, 04 Dec 2024 11:13:00 GMTడిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గర మొత్తం ఐదు శాఖలున్నాయి.  పట్టుబట్టి  మరీ పౌరసరఫరాలశాఖను తీసుకున్నారు. దీనిని తన స్నేహితుడు నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు.  వెంటనే పౌరసరఫరాలశాఖలో అసలు ఏం జరుగుతోంది? ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది? అనే విషయాలను తెలుసుకోవడంపై ఆయన దృష్టిసారించారు.  మొత్తం ఒక స్పష్టత వచ్చిన తర్వాత కాకినాడలో విస్త్రత తనిఖీలు చేపట్టారు.  



ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ ఒకటికి రెండుసార్లు కాకినాడ పర్యటించి వెళ్లారు.   కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్యకలాపాలు, వ్యాపార వ్యవహారాలపై కూపీ లాగి అన్ని వివరాలను సేకరించి దగ్గర పెట్టుకున్నారు.  కొద్దిరోజుల క్రితమే కాకినాడ జిల్లా కరప మండలంలోని గురజానపల్లిలో ద్వారంపూడికి చెందిన రొయ్యలను శుద్ధి చేసే కంపెనీని ప్రభుత్వం మూసేసింది.  తాజాగా ప్రత్తిపాడు మండలం లంపకలోవ దగ్గర ఉన్న వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ పేరుతో ఉన్న మరో కంపెనీని కూడా మూసేసింది.



ఎన్నికలు జరగడానికి ముందు పవన్ కల్యాణ్ కాకినాడలో వారాహి యాత్రను నిర్వహించారు.  ద్వారంపూడిపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీ అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని వెలికితీసి నడిరోడ్డుపై నిలబెట్టకపోతే నాపేరు పవన్ కల్యాణ్ కాదు అని ప్రతిజ్ఞ చేశారు.  అయితే ద్వారంపూడి స్పందించి ముందు నువ్వు గెలిచి చూపించు అంటూ సెటైర్ వేశారు.  తర్వాత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన 100 శాతం విజయాలను నమోదు చేసింది.


ఆ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన వ్యాపారాలన్నీ బద్ధలవుతున్నాయి.  ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బియ్యం మిల్లుల్లో విస్త్రత తనిఖీలు నిర్వహించారు.  ఆ సమయంలో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. కాకినాడు పోర్టు ప్రయివేటు పోర్టు కావడంతో ఇక్కడి నుంచి యథేచ్ఛగా గత ఐదు సంవత్సరాల్లో రేషన్ బియ్యం ఎగుమతులు అక్రమంగాజరిగాయి.  ప్రస్తుతం వాటిపై కొరడా ఝుళిపించారు.



స్టెల్లా నౌకలో అక్రమంగా ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నౌకపై కేసు నమోదు చేయబోతున్నారు. అయితే ఇవేవీ ఆషామాషీగా జరగలేదు. కొంతకాలంగా పవన్ కల్యాణ్ ద్వారంపూడికి చెందిన వ్యాపారాలు, అక్రమాలు, ఐదేళ్లలో చేసిన పనులపై పూర్తిగా అధ్యయనం చేశారు. వాటిని ఆధారంగా చేసుకొని పక్కాగా రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ అంటే చాలా తేలికగా తీసుకున్నారని, ఆయన్ను రెచ్చగొట్టి తన గొయ్యిని తాను తవ్వుకునేలా ద్వారంపూడి చేసుకున్నారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప-2 టికెట్ రేట్ ల ఎఫెక్ట్ మెగా హీరోల సినిమాలపై పడబోతుందా.. పాపం తట్టుకోలేరు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>