Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ticket-ratesc6fe1219-4cd1-4462-a1d5-284310e7de25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ticket-ratesc6fe1219-4cd1-4462-a1d5-284310e7de25-415x250-IndiaHerald.jpgఅన్ని సినిమా ఇండస్ట్రీలలో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ వుంటారు.. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు భక్తులు వుంటారు.. అంతలా ఫ్యాన్స్ తమకి ఇష్టమైన హీరోని అభిమానిస్తారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ ఉందంటే చాలు ఎక్కడ లేని హడావుడి చేస్తారు..రిలీజ్ రోజును పండగలా జరుపుకుంటారు.. అందుకే మన స్టార్ హీరోలు ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అలాంటి సినిమాలు తీయడానికే ఇష్టపడతారు.. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతుంది.. తెలుగు సినిమా ప్రపంచస్థాయికి చేరుకోవడంతో మేకర్స్ సినిమా తీసే విధానం మారింది.. #ticket rates{#}Ee Rojullo;Cinema Tickets;Tollywood;India;Hero;Telugu;Cinemaటికెట్స్ రేట్ల విషయంలో మూర్తి తాతకే ఫ్యాన్స్ సపోర్ట్..!!టికెట్స్ రేట్ల విషయంలో మూర్తి తాతకే ఫ్యాన్స్ సపోర్ట్..!!#ticket rates{#}Ee Rojullo;Cinema Tickets;Tollywood;India;Hero;Telugu;CinemaWed, 04 Dec 2024 11:00:42 GMTఅన్ని సినిమా ఇండస్ట్రీలలో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ వుంటారు.. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు భక్తులు వుంటారు.. అంతలా ఫ్యాన్స్ తమకి ఇష్టమైన హీరోని అభిమానిస్తారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ ఉందంటే చాలు ఎక్కడ లేని హడావుడి చేస్తారు..రిలీజ్ రోజును పండగలా జరుపుకుంటారు.. అందుకే మన స్టార్ హీరోలు ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో అలాంటి సినిమాలు తీయడానికే ఇష్టపడతారు.. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతుంది.. తెలుగు సినిమా ప్రపంచస్థాయికి చేరుకోవడంతో మేకర్స్ సినిమా తీసే విధానం మారింది.. గతంలో ఒక రీజియన్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీసే దర్శకులు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి మరింత బడ్జెట్ ని కేటాయించి కథకి అవసరం లేకపోయినా కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ తో నింపేస్తున్నారు.. అయితే ఎన్ని చేసినా కానీ చివరికీ కావాల్సింది కలెక్షన్స్..
సినిమా పూర్తి చేయడం వరకు ఒక భాద్యత అయితే దానిని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం మరొక భాద్యత..
 
ఈ రోజుల్లో ప్రమోషన్ లేకపోతే ఆ సినిమా భవిష్యత్ అంధకారమే.. అందుకే సినిమా తీసేంతవరకు కష్టపడే దర్శకులు, హీరోలు ప్రమోషన్స్ కోసం అసలైన కష్టాలు అనుభవిస్తారు.. అయితే ఎన్ని చేసినా కానీ ఆ సినిమాను సామాన్య ప్రేక్షకుడు సైతం చూడటానికే…కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం అలా లేవు.. భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కడంతో సినిమా టికెట్స్ రేట్స్ కూడా భారీగానే వుంటున్నాయి.. సాధారణంగా సినిమా రిలీజ్ సమయంలో టికెట్స్ రేట్స్ ఎక్కువగానే ఉంటాయి.ఆ హీరోని అభిమానించే అభిమానులు ఎంత రేట్ కి అయినా టికెట్స్ కొని సినిమా చూస్తాడు.. తన అభిమాన హీరో సినిమా చూడకపోతే ఆ ఫ్యాన్ కి అవమానం అందుకే ఎంత ఖర్చు అయినా సినిమా చూస్తాడు..అయితే దీన్ని కూడా నిర్మాతలు బిజినెస్ గా మార్చుకుంటున్నారు.. ఈ విషయంపై ప్రముఖ సినీ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అయిన విఎస్ఎన్ మూర్తి గారు అద్భుతంగా చెప్పారు..

ఒక సినిమా విజయం సాధించాలంటే ఫ్యాన్స్ సపోర్ట్ చాలా అవసరం.. అలాంటి అభిమానులు తమ ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయిందంటే అందరికంటే ముందుగా సినిమా చూడాలని అన్నింటికన్నా ఏ షో ముందు అయితే అది చూడాలని బలంగా కోరుకుంటారు. ఫ్యాన్స్ అంటే ఓ సాధారణ కార్యకర్త లాంటి వాడు..జేబు నిండా డబ్బులు లేని వ్యక్తి. అలాంటి ఫ్యాన్స్ కి వీలైతే తక్కువ రేట్ కు సినిమా చూపించాలీ. లేదంటే ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా షోలు ఏర్పాటు చేసి సాధారణ రేటుకి సినిమా చూపించాలి.. అంతే కానీ ఫ్యాన్స్ లేకుంటే మేము లేము అని చెప్పుకునే హీరోలు టికెట్స్ రేట్లు పెంచేసి ఆ ఫ్యాన్స్ నే నిలువులా దోచుకుంటున్నారు.. ఇది కరెక్ట్ కాదు.. సినిమా అందరూ చూడాలని కోరుకోవాలి.. అని మూర్తి గారు చెప్పారు.. దీనికి ఫ్యాన్స్ నుండి ఆయనకు ఫుల్ సపోర్ట్ వస్తుంది..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 విషయంలో సుకుమార్ సంతృప్తిగా లేడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>