EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/panjab2c28758e-43bd-4a3d-96a9-36f459ddc0ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/panjab2c28758e-43bd-4a3d-96a9-36f459ddc0ca-415x250-IndiaHerald.jpgపంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై సిక్కుల అత్యున్నత సంస్థ అకాల్ తఖ్త్ కఠిన నిర్ణయం తీసుకుంది. డేరా బాబాకు మద్దతుగా నిలిచినందుకు ఆయనపై తీవ్ర చర్యలకు పాల్పడింది.తాను చేసిన పనులకు క్షమాపణ చెప్పినప్పటికీ కఠిన శిక్ష విధించింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు, ప్రకాశ్ సింగ్ బాదల్ కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్. ఆయన పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం. అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు కూడా. 2015లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్కు అనుకూలంగా సుఖ్బీర్ బాదల్ వ్యవహరించినట్లు అకాల్ తఖ్త్ తేల్చింది. ఇక... panjab{#}Sukhbir Singh Badal;Punjab;Father;tuesday;Party;monday;ram pothineniమాజీ డిప్యూటీ సీఎంకి టాయిలెట్లు శుభ్రం చేయాలని శిక్ష? ఎక్కడో తెలుసా?మాజీ డిప్యూటీ సీఎంకి టాయిలెట్లు శుభ్రం చేయాలని శిక్ష? ఎక్కడో తెలుసా?panjab{#}Sukhbir Singh Badal;Punjab;Father;tuesday;Party;monday;ram pothineniWed, 04 Dec 2024 10:15:00 GMTపంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై సిక్కుల అత్యున్నత సంస్థ అకాల్ తఖ్త్ కఠిన నిర్ణయం తీసుకుంది. డేరా బాబాకు మద్దతుగా నిలిచినందుకు ఆయనపై తీవ్ర చర్యలకు పాల్పడింది.తాను చేసిన పనులకు క్షమాపణ చెప్పినప్పటికీ కఠిన శిక్ష విధించింది.


పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు, ప్రకాశ్ సింగ్ బాదల్ కొడుకు సుఖ్‌బీర్ సింగ్ బాదల్. ఆయన పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం. అకాలీదళ్ మాజీ అధ్యక్షుడు కూడా. 2015లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు అనుకూలంగా సుఖ్‌బీర్ బాదల్ వ్యవహరించినట్లు అకాల్ తఖ్త్ తేల్చింది. ఇక... 2007లోనూ గుర్మీత్ రామ్ రహీమ్ సిక్కు గురువుల మాదిరిగానే దుస్తులు ధరించి ఒక వేడుక నిర్వహించాడు. అందుకు గాను అకల్ తఖ్త్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ క్రమంలో తన ఇన్‌ప్లూయెన్స్‌ను వాడి డేరా చీఫ్‌కు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌కు క్షమాబిక్ష ప్రసాదించారు. వాటిపై విచారణ జరిపి అకాల్ తఖ్త్‌ ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ నిర్ణయం ప్రకారం.. ప్రతీ సోమవారం అకాల్ తఖ్త్ జాతేదర్ గియాని రగ్బీర్ సింగ్ నేతృత్వంలోని సిక్కు మతానికి చెందిన ఐదుగురు అత్యున్నత వ్యక్తులు.. దుష్ప్రవర్తనకు మతపరమైన (క్వాంటమ్ ఆఫ్ తంఖా)ను విధించారు. ఈ క్రమంలో ఇప్పటికే శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చేసిన రాజీనామాను ఆమోదించింది. ఆరు నెలల్లోగా కొత్త చీఫ్‌ను నియమించాలని వర్కింగ్ కమిటీకి జాతేదార్ సూచించారు.


అయితే.. తాను చేసిన అన్ని పనులకు గాను సుఖ్‌బీర్ బాదల్ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ అకాల్ తఖ్త్ మాత్రం కఠిన శిక్షను విధించింది. ప్రస్తుతం ఆయన వీల్‌చైర్‌లో ఉండగా.. 2015లో పంజాబ్ మంత్రివర్గంలో ఉన్న సభ్యులు, అకాలీదళ్ నేతలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల వరకు అమృతసర్ స్వర్ణ దేవాలయంలోని బాత్రూంలను శుభ్రం చేస్తారని అకాలీ తఖ్త్ వెల్లడించింది. అనంతరం స్నానం చేసి వచ్చి లంగర్ వడ్డిస్తారని తెలిపింది. అలాగే.. ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు గౌరవంగా ఇచ్చిన ఫఖర్-ఎ-కౌమ్(సిక్కు మతానికి గర్వకారణం)ను తొలగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.  కాగా.. 2011లో ప్రకాశ్ సింగ్‌ను ఈ ఫఖర్-ఎ-కౌమ్‌తో సత్కరించారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 విషయంలో సుకుమార్ సంతృప్తిగా లేడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>