Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/---d0b4ccdc-66f6-4221-bee8-2dde61547452-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/---d0b4ccdc-66f6-4221-bee8-2dde61547452-415x250-IndiaHerald.jpgనేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇక ఏకాగ్రతను పెంచుకోవడం కోసం ఎంతో మంది యోగా, ధ్యానం చేసేందుకు మొగ్గుచూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు అయితే ఇలా యోగ, ధ్యానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి అక్కడ ఒంటరిగా కూర్చుని యోగా చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు వీడియోలు కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయాయి. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ కూడా ఇలాగే చేయాలని అనుకుంది. ఒక ప్రశాంతమైన వాతావరణంలో యోగా చేయడవైరల్{#}Yuva;Yoga;Aqua;Thailand;Heroineయోగా చేస్తూ ప్రాణం పోగొట్టుకున్న హీరోయిన్.. వైరల్ వీడియో?యోగా చేస్తూ ప్రాణం పోగొట్టుకున్న హీరోయిన్.. వైరల్ వీడియో?వైరల్{#}Yuva;Yoga;Aqua;Thailand;HeroineTue, 03 Dec 2024 10:16:00 GMTనేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇక ఏకాగ్రతను పెంచుకోవడం కోసం ఎంతో మంది యోగా, ధ్యానం చేసేందుకు మొగ్గుచూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు అయితే ఇలా యోగ, ధ్యానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి అక్కడ ఒంటరిగా కూర్చుని యోగా చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు వీడియోలు కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయాయి.


 అయితే ఇక్కడ ఒక హీరోయిన్ కూడా ఇలాగే చేయాలని అనుకుంది. ఒక ప్రశాంతమైన వాతావరణంలో యోగా చేయడానికి సిద్ధమైంది. కానీ అక్కడే తనకోసం మృత్యువు వేచి చూస్తుంది అన్నది మాత్రం ఊహించుకోలేకపోయింది. ఏకంగా సముద్రపు ఒడ్డున వెళ్లి ప్రశాంతమైన వాతావరణంలో యోగా చేయడం మొదలుపెట్టిన హీరోయిన్.. చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారి పోయింది. ఈ ఘటన థాయిలాండ్ లో వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన 24 ఏళ్ల యువ నటి కెమిల్లా థాయిలాండ్ పర్యటనకు వెళ్ళింది. ఈ క్రమంలోనె ఒక ద్వీపంలో నీటి ఒడ్డున రాళ్లపై కూర్చొని ఇక ప్రశాంతం గా ధ్యానం చేయాలని అనుకుంది.


 ఈ క్రమం లోనే సముద్రపు ఒడ్డున ఇలా ధ్యానం చేస్తున్న సమయం లో ఊహించని ఘటన జరిగింది. భారీ కెరటం దూసుకు వచ్చి ఆమెను సముద్రంలోకి లాక్కెళ్ళింది. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. అయితే ఆమె మళ్లీ బయటికి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమెను రక్షించేందుకు చుట్టుపక్కన ఉన్నవారు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. చివరికి కొన్ని నిమిషాలకే శవమై ఆమె ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. ఇది చూసి అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు.
" style="height: 579px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగా వర్సెస్ అల్లు వార్ : మధ్యలో అడ్డం ఇరుక్కుపోయిన స్టార్ డైరెక్టర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>