Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywoodd18741cc-1c24-430f-94b5-a4be5a7e7358-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywoodd18741cc-1c24-430f-94b5-a4be5a7e7358-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వారి గురించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. సాధారణంగా ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు ప్రొఫెషనల్ విషయాలు అందరితో పంచుకున్నప్పటికీ అటు పర్సనల్ విషయాలు మాత్రం సీక్రెట్ గానే ఉంచుకునేవారు. కానీ నేటి రోజుల్లో సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇంకొన్ని విషయాలు అటు ఆయా సెలబ్రెటీలు చెప్పకపోయినా ఆటోమేటిక్గా బbollywood{#}Newyork;Heroine;Alia Bhatt;Nargis;Murder.;Love;media;Cinemaబ్రేకప్ చెప్పాడని.. ప్రియుడిని హత్య చేసిన హీరోయిన్ చెల్లి?బ్రేకప్ చెప్పాడని.. ప్రియుడిని హత్య చేసిన హీరోయిన్ చెల్లి?bollywood{#}Newyork;Heroine;Alia Bhatt;Nargis;Murder.;Love;media;CinemaTue, 03 Dec 2024 15:45:00 GMTసాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వారి గురించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. సాధారణంగా ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు ప్రొఫెషనల్ విషయాలు అందరితో పంచుకున్నప్పటికీ అటు పర్సనల్ విషయాలు మాత్రం సీక్రెట్ గానే ఉంచుకునేవారు. కానీ నేటి రోజుల్లో సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇంకొన్ని విషయాలు అటు ఆయా సెలబ్రెటీలు చెప్పకపోయినా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి.


 అయితే కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదండోయ్ సెలబ్రిటీ కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు కూడా అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి విషయమే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మామూలుగా అయితే సినీ సెలబ్రిటీల ప్రేమాయణాలు బ్రేకప్ చెప్పుకొని మరొకరితో లవ్ కొనసాగించడం సర్వసాధారణం గా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఘటన మరోలా జరిగింది. ఏకంగా ఒక హీరోయిన్ చెల్లెలు ఒక హత్య చేసింది. అది కూడా ఎవరినో కాదు లవ్ బ్రేకప్ చెప్పిన ప్రియుడిని దారుణంగా హత్య చేసేసింది.


 ఈ విషయం కాస్త ప్రస్తుతం ఇంటర్నెట్లో సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. రాక్ స్టార్ మూవీ నటి అయిన నర్గీస్ ఫక్రి సిస్టర్ అలియా ఫక్రి (43)ని న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ప్రియుడు జాకబ్ (35) అతని స్నేహితుడు ఎటిని (33) ఉంటున్న గ్యారేజ్ని ఇటీవలే ఆలియా ఫక్రి తగలబెట్టేసారు. ఇక ఈ ఘటనలో ఏకంగా హీరోయిన్ చెల్లెలి మాజీ ప్రియుడు అతని స్నేహితుడు కూడా సజీవ దహనం అయిపోయారు. అయితే ఏడాది క్రితం ఆలియా పక్రి ప్రియుడు బ్రేకప్ చెప్పినప్పటికీ ఆమె యాక్సెప్ట్ చేయలేదట. ఇక ఇటీవల కోపంతో రగిలిపోయిన ఆమె మీరిద్దరూ నా చేతుల్లో చచ్చారు అంటూ ఏకంగా గ్యారేజ్ కి నిప్పుంటించడంతో ఇద్దరు సజీవ దహనం అయిపోయారు.ఈ క్రమంలోనే ఆమెను న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: జనం మధ్యలోకి జగన్.. నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>