Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/----02b90fcb-380b-4168-9ab1-5938b7853eae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/----02b90fcb-380b-4168-9ab1-5938b7853eae-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే చాలు అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది సూపర్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ వస్తే అబ్బో ఇక అభిమానులు పండగ చేసుకోవడం ఒక్కటే తక్కువ. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా ఇలాంటి పండుగ చేసుకోవడానికి సిద్ధమైపోయారు. ఎందుకంటే దాదాపు మూడేళ్ల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పుష్ప సీక్వెల్ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ తో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పూహాస్ప{#}festival;Posters;India;sukumar;December;Allu Arjun;Cinemaపుష్ప-3 టైటిల్ ఇదేనా.. లీక్ అయిపోయిందిగా?పుష్ప-3 టైటిల్ ఇదేనా.. లీక్ అయిపోయిందిగా?పూహాస్ప{#}festival;Posters;India;sukumar;December;Allu Arjun;CinemaTue, 03 Dec 2024 14:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే చాలు అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది సూపర్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ వస్తే అబ్బో ఇక అభిమానులు పండగ చేసుకోవడం ఒక్కటే తక్కువ. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు అందరూ కూడా ఇలాంటి పండుగ చేసుకోవడానికి సిద్ధమైపోయారు. ఎందుకంటే దాదాపు మూడేళ్ల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పుష్ప సీక్వెల్ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 గంధపు చెక్కల స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ తో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్పా సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాకు సీక్వల్ గా ప్రస్తుతం పుష్ప-2 అనే సినిమా తెరకెక్కింది. ఇక ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఇక ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీన అంటే మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే పుష్ప 2 మాత్రమే కాదు మరో పార్ట్ కూడా ఉండబోతుంది అని ఒక టాక్ గత కొన్ని రోజుల నుండి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇక ఇది నిజమే అన్న విషయం ఇప్పుడు లీక్ అయిపోయింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారమే పుష్ప-3 కూడా ఉండనుంది అని ఇక ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. పుష్ప-2 మరో రెండు రోజుల్లో విడుదల కానుండగా టైటిల్ ఎండ్ కార్డు లో పుష్ప-3 టైటిల్ రివిల్ చేయబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఇటీవల ఎడిటింగ్ రూమ్లో దిగిన ఫోటోని చిత్ర యూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల స్క్రీన్ పై పుష్ప-3 ది ర్యాంపేజ్ అని రాసి ఉన్న పోస్టర్ కనిపిస్తుంది. దీంతో పార్ట్ 3 టైటిల్ ఇదే అంటూఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది  ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: జనం మధ్యలోకి జగన్.. నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>