EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycpddb84118-0551-469a-8423-c7b712b9e9c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycpddb84118-0551-469a-8423-c7b712b9e9c1-415x250-IndiaHerald.jpgవైసీపీ అధికార ప్రతినిధులు ఎక్కడున్నారు? అంటే సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఏ పార్టీ కైనా అధికార ప్రతినిధులు కీలకం. పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తారు.అదేవిధంగా.. ప్రత్యర్థి నాయకులు చేసే విమర్శలకు కౌంటర్ ఇస్తారు. మీడియా ముందుకు కూడా వస్తారు. ఇక, మరికొందరు మీడియా చర్చల్లోనూ పాల్గొని తమ పార్టీవిధానాలను సమర్థించుకుంటారు. ఇదేసమయంలో అధికార పక్షంపైనా విమర్శలు గుప్పిస్తారు. అయితే.. ఈ విషయంలో వైసీపీ నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. వారి వాయిస్ కూడా వినిపించ డం లేదు. గతంలో వైసీపీ అధికారంలోఉన్నycp{#}Perni Nani;television;Party;Jagan;YCP;Government;mediaవైసీపీలో అధికార ప్రతినిధులు లేరా? ఒక్కరూ బయటకి వచ్చి మాట్లాడరేంటి..?వైసీపీలో అధికార ప్రతినిధులు లేరా? ఒక్కరూ బయటకి వచ్చి మాట్లాడరేంటి..?ycp{#}Perni Nani;television;Party;Jagan;YCP;Government;mediaMon, 02 Dec 2024 10:08:00 GMTవైసీపీ అధికార ప్రతినిధులు ఎక్కడున్నారు? అంటే సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఏ పార్టీ కైనా అధికార ప్రతినిధులు కీలకం. పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తారు.అదేవిధంగా.. ప్రత్యర్థి నాయకులు చేసే విమర్శలకు కౌంటర్ ఇస్తారు. మీడియా ముందుకు కూడా వస్తారు. ఇక, మరికొందరు మీడియా చర్చల్లోనూ పాల్గొని తమ పార్టీవిధానాలను సమర్థించుకుంటారు. ఇదేసమయంలో అధికార పక్షంపైనా విమర్శలు గుప్పిస్తారు.


అయితే.. ఈ విషయంలో వైసీపీ నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. వారి వాయిస్ కూడా వినిపించ డం లేదు. గతంలో వైసీపీ అధికారంలోఉన్నప్పుడు కొందరు నాయకులు మీడియా ముందుకు వచ్చేవా రు. ప్రభుత్వ విధానాలను వివరించేవారు. మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్నారెడ్డి వంటివారు తరచుగా మీడియా ముందుకు వచ్చేవారు. ఇక, మంత్రులు కూడా ఫైర్ కామెంట్సు చేసేవారు. కానీ, ఇప్పుడు జగన్ తప్ప.. ఎవరూ మీడియా ముందుకు రావడం లేదు.


గుడివాడ అమర్నాథ్‌, అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి మాజీ మంత్రులు మాత్రం ఇష్యూబేస్డ్ టాపి క్స్ ఎంచుకుని మీడియాతో మాట్లాడుతున్నారు తప్ప.. ఇంతకుమించి వారు కూడా పెద్దగా మీడియా ముం దుకు రాకపోవడం గమనార్హం. ఇలా వచ్చిన వారు కూడా.. చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక, టీవీ చర్చల్లోనూ బలమైన వాయిస్ వినిపించేవారు కనిపించడం లేదు. కేవలం జగన్ మాత్రమే మీడియ సమావేశాలు పెడుతున్నారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు?


ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వం పెడుతున్న కేసులు. తద్వారా ఎదురవుతున్న చిక్కులు. మరొకటి.. పార్టీ పరంగా నాయకులకు దక్కని ఊరట వంటివి ఎవరూ సాహసం చేసేందుకు ముందుకు రావడం లేదు. కేవలం కేతిరెడ్డి ఒక్కరే సెల్పీ వీడియోలు చేస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. ఇక పార్టీ పరంగా ఎంత చేసినాగుర్తింపు కొందరికే దక్కుతోందన్న ఆవేదన కూడా నాయకులను వేధిస్తుండడం. దీంతో అధికార ప్రతినిధులు ఉన్నా.. వారి అజ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టీజర్: కొత్త కాన్సెప్ట్ తో ఉపేంద్ర UI .. టీజర్ అదుర్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>