MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny21b35932-4887-4b1c-8e7d-4a5ebb1cf2d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny21b35932-4887-4b1c-8e7d-4a5ebb1cf2d4-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం ఎంతోమంది జీవితాలను నిర్ణయిస్తుంది. సినిమా హిట్టైతే ఆకాశానికి ఎత్తే ఈ సమాజంలో సినిమా ఫ్లాపైతే ఎలాంటి కామెంట్లు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రంగానికి చెందిన నటీనటులకు ప్రతి సినిమా ఒక అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాతో బుధవారం రోజున అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. allu arjun{#}wednesday;Friday;Cinema;Andhra Pradesh;Allu Arjunతప్పటడుగులు వేస్తున్న బన్నీ.. అలా జరిగితే మూల్యం చెల్లించుకోవాల్సిందే!తప్పటడుగులు వేస్తున్న బన్నీ.. అలా జరిగితే మూల్యం చెల్లించుకోవాల్సిందే!allu arjun{#}wednesday;Friday;Cinema;Andhra Pradesh;Allu ArjunMon, 02 Dec 2024 11:57:00 GMTసినిమా ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం ఎంతోమంది జీవితాలను నిర్ణయిస్తుంది. సినిమా హిట్టైతే ఆకాశానికి ఎత్తే ఈ సమాజంలో సినిమా ఫ్లాపైతే ఎలాంటి కామెంట్లు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రంగానికి చెందిన నటీనటులకు ప్రతి సినిమా ఒక అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాతో బుధవారం రోజున అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
 
ఏపీ మినహా అన్ని ఏరియాలలో ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే పుష్ప ది రూల్ మూవీ విషయంలో మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే బన్నీ ముందుకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని కొందరు మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇతర స్టార్ హీరోలు సైతం ఎంత ఎదిగినా ఒదిగి ఉంటుండగా బన్నీ వాళ్లకు భిన్నంగా అడుగులు వేస్తున్నారని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
 
పుష్ప ది రూల్ భారీ టికెట్ రేట్లు సినీ అభిమానులకు షాకిస్తున్నాయి. ముంబైలో ఈ సినిమాకు మరీ భారీ స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు. సినిమాకు ఏ మాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా ఆ ప్రభావం రిజల్ట్ పై పడే ఛాన్స్ ఉంది. టికెట్ రేట్ల విషయంలో పుష్ప2 హద్దులు దాటిందని కామెంట్లు వినిపిస్తుండగా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ తో ఎదిగిన బన్నీ ఇప్పుడు తన ఆటిట్యూడ్ తో కొంతమంది అభిమానులను దూరం చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
వ్యాపారం కోసం అభిమానాన్ని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమాకు రన్ టైమ్ ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి. పుష్ప ది రూల్ బుకింగ్స్ బాగానే ఉన్నా మరీ టికెట్లు దొరకని పరిస్థితి రాలేదు. పుష్ప ది రూల్ ఫస్ట్ డే  కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప-2.. పిల్లల వెర్షన్ ట్రైలర్ చూశారా.. అదిరిపోయింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>