Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoofa75d4812-3917-4347-9f35-460cb8284d72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoofa75d4812-3917-4347-9f35-460cb8284d72-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే ముందుకు సాగగలరు. సక్సెస్ ఉంటేనే పారితోషకం ఎక్కువ తీసుకోగలరు. సక్సెస్ ఉంటేనే ఇండస్ట్రీలో పాపులారిటీ కూడా దక్కుతుంది. అందుకే ఈ సక్సెస్ వెంట హీరోలు దర్శకులు అందరూ కూడా పరుగులు పెడుతూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఇలా సక్సెస్ ని బట్టి హీరోలు తమ పారితోషకం నిర్ణయించేవారు. ఈ మధ్యకాలంలో అయితే రెండు మూడు సినిమాలు మంచి విజయం సాధించాయి అంటే చాలు రెమ్యూనరేషన్ అమాంతం పెంచేయడం చూస్తూ ఉన్నాం. అయితే మొన్నటి వరకు స్టార్ హీరోలు ఇలా పారితోషకం ఎంత పెంచినప్పటికీ అటు డైరెక్టర్లtollywoof{#}arya;Rajarani;Aryaa;shankar;Jawaan;atlee kumar;Success;Salman Khan;Cinema;India;Directorగురువుని మించిన శిష్యుడు.. ఆ డైరెక్టర్ రూ.100 కోట్ల పారితోషకం?గురువుని మించిన శిష్యుడు.. ఆ డైరెక్టర్ రూ.100 కోట్ల పారితోషకం?tollywoof{#}arya;Rajarani;Aryaa;shankar;Jawaan;atlee kumar;Success;Salman Khan;Cinema;India;DirectorMon, 02 Dec 2024 11:00:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే ముందుకు సాగగలరు. సక్సెస్ ఉంటేనే పారితోషకం ఎక్కువ తీసుకోగలరు. సక్సెస్ ఉంటేనే ఇండస్ట్రీలో పాపులారిటీ కూడా దక్కుతుంది. అందుకే ఈ సక్సెస్ వెంట హీరోలు దర్శకులు అందరూ కూడా పరుగులు పెడుతూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఇలా సక్సెస్ ని బట్టి హీరోలు తమ పారితోషకం నిర్ణయించేవారు. ఈ మధ్యకాలంలో అయితే రెండు మూడు సినిమాలు మంచి విజయం సాధించాయి అంటే చాలు రెమ్యూనరేషన్ అమాంతం పెంచేయడం చూస్తూ ఉన్నాం.


 అయితే మొన్నటి వరకు స్టార్ హీరోలు ఇలా పారితోషకం ఎంత పెంచినప్పటికీ అటు డైరెక్టర్లు మాత్రం ఇక తక్కువగానే పారితోషకం పుచ్చుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో అయితే డైరెక్టర్లు కూడా పారితోషకం విషయంలో తగ్గేదేలే అంటున్నారు. హీరోలతో పోటీపడి మరి అటు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా పారితోషకాలతో అటు డైరెక్టర్లు కూడా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి గురువును మించిన పారితోషకం తీసుకుంటున్నాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.


 ఆ డైరెక్టర్ ఎవరో కాదు అట్లీ. షారుక్ ఖాన్ తో జవాన్ సినిమా తీసి హిట్టు కొట్టిన అట్లీ పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. యంత్రన్, నాన్ సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఈయన 2013లో ఆర్య హీరోగా వచ్చిన రాజారాణి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక ఆ తర్వాత ప్రతి సినిమాతో హిట్టు కొట్టాడు. షారుక్ తో తీసిన జవాన్ సినిమా అయితే 1000 కోట్ల వసూళ్లు సాధించింది. ప్రస్తుతం తదుపరి సినిమా సల్మాన్ ఖాన్ తో చేయబోతున్నాడు. సల్మాన్ తో చేయబోయే సినిమాకి అట్లీ 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. జవాన్ సినిమాకి 60 కోట్లు తీసుకున్న అట్లీ ఇప్పుడు జీతం రెట్టింపు చేశాడట. అయితే తన గురువు శంకర్ కేవలం 60 నుంచి 80 కోట్లు మాత్రమే తీసుకుంటుంటే.. ఇక శిష్యుడైన అట్లీ మాత్రం 100 కోట్లు తీసుకుంటూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో అట్లీ గురువును మించిన శిష్యుడు అయ్యాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప-2.. పిల్లల వెర్షన్ ట్రైలర్ చూశారా.. అదిరిపోయింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>