MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/its-really-awkward-triggering-reactions-on-rashmika-allu-arjun71b1f580-a122-4f98-bb0d-81ee7fc587bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/its-really-awkward-triggering-reactions-on-rashmika-allu-arjun71b1f580-a122-4f98-bb0d-81ee7fc587bd-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా అల్లు అర్జున్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 సినిమాను తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. pushpa 2{#}Hyderabad;India;Event;December;Telangana;Arjun;sukumar;Allu Arjun;rashmika mandanna;Cinemaపుష్ప 2 స్పీడ్ కు తెలంగాణ హైకోర్టు బ్రేక్ ?పుష్ప 2 స్పీడ్ కు తెలంగాణ హైకోర్టు బ్రేక్ ?pushpa 2{#}Hyderabad;India;Event;December;Telangana;Arjun;sukumar;Allu Arjun;rashmika mandanna;CinemaMon, 02 Dec 2024 20:54:00 GMTఅల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా అల్లు అర్జున్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 సినిమాను తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.


ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయి. కేవలం ఈ సినిమా విడుదలకు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా, రష్మిక మందన హీరోయిన్గా చేసింది. స్పెషల్ సాంగ్ లో శ్రీలీల స్టెప్పులు వేసింది. తాజాగా పుష్ప 2 సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో టికెట్ కు రూ. 1200 వరకు తెలంగాణ ప్రభుత్వం పెంచింది.


దీంతో పుష్ప 2 టికెట్ల వ్యవహారం హైకోర్టుకు చేరుకుంది. టికెట్లు ధరలను భారీగా పెంచకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై హైకోర్టులో రేపు విచారణ కొనసాగనుంది. కాగా, ప్రీమియర్లకు టికెట్ ధరపై రూ. 800 పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే ఒక్కో టికెట్ 1200 వరకు పెరిగింది.  డిసెంబర్ 5 నుంచి 8 వరకు రూ. 200, ఆ తర్వాత కూడా టికెట్ల ధర పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే.


మరి రేపు హైకోర్టులో టికెట్ల ధర విషయంపై న్యాయమూర్తి ఇలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. కాగా, ఈరోజు పుష్ప 2 ప్రీ రిలీజ్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడాలో జరుగుతోంది. ఈవెంట్ కి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇలాంటి నేపథ్యంలో హైకోర్టులో కేసు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ పేరుమీదున్న చెత్త రికార్డ్ ను బీట్ చేసిన సూర్య.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>