MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-akhanda-28af20a5b-8973-437b-9346-a189953833da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-akhanda-28af20a5b-8973-437b-9346-a189953833da-415x250-IndiaHerald.jpg అఖండ సూపర్ డూపర్ హిట్ అవడంతో అఖండకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి ప్రకటించారు. దీంతో ఇప్పుడు అఖండ 2 - తాండవం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపించబోతున్నాడని ఆ హీరోది నెగిటివ్ రోల్ అని టాక్ నడుస్తోంది. నిజానికి అఖండ 2 లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సంజయ్ దత్ తో పాటు మరో సౌత్ హీరో కూడా ఉంటాడని టాక్‌. Akhanda 2{#}Sanjay Dutt;boyapati srinu;simhaa;Legend;Pooja Hegde;Balakrishna;News;thaman s;ram pothineni;bollywood;Music;India;Hero;Tollywood;Darsakudu;Director;Cinema' అఖండ 2 ' లో మ‌రో సీనియ‌ర్ హీరో... సంజ‌య్‌ద‌త్‌తో పాటు మ‌రో స్టార్‌...!' అఖండ 2 ' లో మ‌రో సీనియ‌ర్ హీరో... సంజ‌య్‌ద‌త్‌తో పాటు మ‌రో స్టార్‌...!Akhanda 2{#}Sanjay Dutt;boyapati srinu;simhaa;Legend;Pooja Hegde;Balakrishna;News;thaman s;ram pothineni;bollywood;Music;India;Hero;Tollywood;Darsakudu;Director;CinemaSun, 01 Dec 2024 10:38:44 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

నందమూరి నట‌సింహ బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ - అఖండ - లెజెండ్ సినిమాలు ఒకదానిని మించి ఒకటి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అఖండ సూపర్ డూపర్ హిట్ అవడంతో అఖండకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి ప్రకటించారు. దీంతో ఇప్పుడు అఖండ 2 - తాండవం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపించబోతున్నాడని ఆ హీరోది నెగిటివ్ రోల్ అని టాక్ నడుస్తోంది. నిజానికి అఖండ 2 లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సంజయ్ దత్ తో పాటు మరో సౌత్ హీరో కూడా ఉంటాడని టాక్‌.


ఏది ఏమైనా అఖండ 2 తాండవం సినిమాలో ఇటు బాలకృష్ణ డబుల్‌ రోల్ .. అటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్తో పాటు మరో హీరో అంటే సినిమాపై ఖచ్చితంగా సౌత్ నుంచి నార్త్ వరకు భారీ అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి సినిమాలో నటించే న‌టీన‌టుల‌ ఎంపికపై దృష్టి పెట్టారు. పలు కీలక పాత్రలకు ఇతర భాషల నటులను తీసుకోవాలని బోయపాటి ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట - గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ట్రేడ్ వ‌ర్గాల్లో ఈ కొత్త సినిమా పై అంచ‌నాలు అయితే ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సెలబ్రిటీలకు టోకరా.. సస్టెయిన్ కార్ట్ అధినేత అరెస్ట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>