Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran-abbavaram0eda1ce8-347a-4f8e-8877-36b637fba296-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran-abbavaram0eda1ce8-347a-4f8e-8877-36b637fba296-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఎదిగిన వారందరో ఉన్నారు. వారిలో ఒకరైన కిరణ్ అబ్బవరం ఇటీవల కాలంలో చాలా హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే ఆయన హీరోగా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్‌ ‘క’ (Ka) బ్లాక్ బస్టర్ హిట్ అయింది. షార్ట్ ఫిల్మ్స్‌ హీరో నుంచి ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఫీచర్ ఫిలిమ్స్ హీరో వరకు సాగిన కిరణ్ జర్నీ ఇన్ స్పిరేషనల్‌గా మారింది. ‘క’ మూవీ ప్రమోషన్స్‌లో కిరణ్ చాలా చురుగ్గా పాల్గొన్నాడు. దాని సక్సెస్‌లోనూ కీలక పాత్ర పోషించాడు. Kiran Abbavaram{#}Thriller;producer;Producer;News;Audience;kiran;Success;Blockbuster hit;Hero;Cinemaనేను బ్రతకాలిగా.. అందుకే రెమ్యూనరేషన్ పెంచా.. కిరణ్ అబ్బవరం కామెంట్స్?నేను బ్రతకాలిగా.. అందుకే రెమ్యూనరేషన్ పెంచా.. కిరణ్ అబ్బవరం కామెంట్స్?Kiran Abbavaram{#}Thriller;producer;Producer;News;Audience;kiran;Success;Blockbuster hit;Hero;CinemaSun, 01 Dec 2024 10:41:00 GMTటాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా ఎదిగిన వారందరో ఉన్నారు. వారిలో ఒకరైన కిరణ్ అబ్బవరం ఇటీవల కాలంలో చాలా హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే ఆయన హీరోగా వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్‌ ‘క’ (Ka) బ్లాక్ బస్టర్ హిట్ అయింది. షార్ట్ ఫిల్మ్స్‌ హీరో నుంచి ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఫీచర్ ఫిలిమ్స్ హీరో వరకు సాగిన కిరణ్ జర్నీ ఇన్ స్పిరేషనల్‌గా మారింది. ‘క’ మూవీ ప్రమోషన్స్‌లో కిరణ్ చాలా చురుగ్గా పాల్గొన్నాడు. దాని సక్సెస్‌లోనూ కీలక పాత్ర పోషించాడు.

‘క’ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ అయింది. థియేటర్లో సక్సెస్ అయిన తర్వాత ఓటీటీలో నాలుగు వారాల తర్వాత రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా తర్వాత కిరణ్ రెమ్యునరేషన్ పెంచేసాడేమో అని ఒక చర్చ మొదలయ్యింది. చివరికి కిరణ్‌ను కూడా ఇదే ప్రశ్న వేశారు జర్నలిస్టులు. దానికి ఈ హీరో ముక్కుసూటిగా ఆన్సర్ చెప్పాడు.

రెమ్యునరేషన్ పెంచినట్లు, స్క్రిప్ట్ వర్క్‌లో కూడా జోక్యం చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై అతను స్పందించాడు. ‘క’ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడం, ఈటీవీ విన్‌లో ఇటీవలే రిలీజ్ అయిన సందర్భంగా మూవీ మేకర్స్ మూవీసక్సెస్ మీట్‌ ఏర్పాటు చేశారు. ఇదే సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ తాను రెమ్యునరేషన్ పెంచినట్లు వస్తున్న వార్తలు వాస్తవమే అని స్పష్టం చేశాడు. ఇప్పటిదాకా తాను చాలా సినిమాల్లో హీరోగా చేశానని, అయినా ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడలేకపోయానని, అందుకే ఇప్పుడు పారితోషికం పెంచాల్సి వచ్చిందని వివరించాడు.

అయితే తాను మరీ భారీగా రెమ్యునరేషన్ పెంచలేదని, ఇకపై ఇబ్బందులు లేకుండా బతకడానికి కొంచెం మనీ ఎక్కువగా తీసుకుందామని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. నిర్మాతలకు లాభాలు వచ్చిన తర్వాతే పెంచిన ఆ కాస్త అమౌంట్ తీసుకుంటానని, లేకపోతే డబ్బులు కూడా అడగనని స్పష్టం చేశాడు. ముందు నిర్మాత సేఫ్ కావడమే తనకు ముఖ్యమని తెలిపాడు. దీంతో కిరణ్ అబ్బవరం పారితోషికం పెంచడంలో తప్పు లేదని చాలామంది ప్రేక్షకులు సమర్ధిస్తున్నారు. ఇలాంటి టాలెంటెడ్ హీరోకి తగిన పారితోషికం ఇవ్వడంలో ఏం లేదు అని మరి కొంతమంది అంటున్నారు. ఇక ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి ఓ సీక్వెల్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సెలబ్రిటీలకు టోకరా.. సస్టెయిన్ కార్ట్ అధినేత అరెస్ట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>